Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 10 ఉత్తమ ఆహారాలు
రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. రక్తం గడ్డకట్టడానికిఉపయోగపడే ఇవి మీ జీవితంలోనూ ఇప్పటికే మీ ప్రాణాలను అనేక సార్లు మౌనంగా కాపాడే ఉంటాయి. మీరు ఇప్పటికే డేంగ్యూ ఫీవర్ గురించి వినే ఉంటారు. ఈ ఫీవర్ వచ్చినప్పుడు, శరీరంలో ప్లేట్ లెట్ స్థాయిలో తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాధం ఏర్పడుతుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను టెక్నికల్ గా థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు . ఈ వైరస్ కు కారణం జన్యుపరమైన, మెడికేషన్స్, ఆల్కహాల్, వైరస్, గర్భాధారణ మరియు ఇతర కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అలా వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా, లేదా ప్లేట్ లెట్ స్థాయిలు తగ్గకుండా ఉండాలన్నా, ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు అతి తక్కువ సమయంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ది చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడవ వల్ల నేచురల్ గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడేవారు, తప్పనిసరిగా అధిక విటమిన్స్ మరియు మినిరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా శరీరం ఎక్కువ ప్లేట్ లెట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అది అనారోగ్యకరమైన శరీరం నుండి తర్వగా కోలుకొనేందుకు సహాయపడుతుంది .
ప్లేట్ లెట్స్ ను నేచురల్ గా అభివృద్దిపరుచుకోవడం కోసం ఈ క్రింద కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను ఇవ్వడం జరిగింది. అందువల్ల మీలో ప్లేట్ లెట్స్ తగ్గాయని తెలుసుకోగానే, వెంటనే ఐరన్ పుష్కలంగా ఉన్న రెండు ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ పవర్ ఫుల్ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

బొప్పాయి
బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. అందుకు మీరు చేయాల్సిండి బొప్పాయి ఆకులను జ్యూస్ ను త్రాగడం లేదా బొప్పాయి ఆకులను కొద్దిగా నీళ్లు పోసి మీడియం మంట మీద ఉడికించాలి. ఆ నీటిని వడగట్టి రోజుకు రెండు సార్లు త్రాగడం వల్ల ప్లేట్ లెట్స్ తగ్గుతాయి.

దానిమ్మ
ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి. దానిమ్మలో విటమిన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ డేంగ్యూ ఫీవర్ తో పోరాడే లక్షణాలను ఫుష్కలంగా కలిగి డేంగ్యూ ఫీవర్ రాకుండా కాపాడుతుంది.

గ్రీన్ లీఫ్స్
శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, కాలే మరియు ఇతర గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ ను అభివృద్ది పరచుకోవచ్చు.

వెల్లుల్లి
శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

బీట్ రూట్
బీట్ రూట్ ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ మరియు క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది . ఇవి బ్లడ్ కౌంట్ మినిమల్ లెవల్ కు అభివృద్ది చేస్తుంది.

లివర్
ప్లేట్ లెట్ ను అభివృద్ది చేయడంలో మరో ఆహార పదార్థం లివర్. అయితే లివర్ ను బాగా ఉడికించి తీసుకోవల్సి ఉంటుంది.

ఎండు ద్రాక్ష:
రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

ఆప్రికాట్
ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

కర్జూరం
ఎండుఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్ లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications
