For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోలన్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ లక్షణాలు- కారణాలు

|

చర్మ సంబంధమైన క్యాన్సర్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది స్త్రీ, పురుషుల్లో అధిక శాతం మంది పెద్ద ప్రేగు క్యాన్సర్ కు గురవుతున్నారు. గతంలో పెద్ద ప్రేగు క్యాన్సర్ సోకితే మరణాలు సంభవించేవని, కానీ ప్రస్తుత ఆధునిక సాంకేతిక, వైద్య పరిజ్ఞానం పెరిగిన కాలంలో ఈ క్యాన్సర్ లక్షణాలను ముందుగా గ్రహిస్తే చికిత్స తో నయం చేసుకోవచ్చు.

పెద్ద ప్రేగులో పురీష ద్వారము (పెద్ద ప్రేగు చివరి భాగంలో ఆంగ్లంలో ఇంటెస్టైన్/కోలన్) అసాధారణ సంఖ్యలో కణాలు (ఆంగ్లంలో సెల్స్) పెరగడం మూలంగా ఈ క్యాన్సర్ సోకుతుంది. మరి ఈ క్యాన్సర్ కు కారణాలు మరియు వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా అవసరం.

సాధారణంగా పెద్ద ప్రేగు లోపల వైపు కొన్ని కణాలు పెరుకుపోతాయి. వీటిని ఆంగ్లంలో పాలిప్స్ అంటారు. ఇవి సాధారణంగా ప్రేగులో కణాల పెరుగుదలలో లోపాల కారణంగా ఏర్పడతాయి. ప్రేగులో కలిగిన సమస్యల మూలమా కొన్ని కణాలు ఒకే చోట పెరిగి అవి బూడిపె లాగా పెరుకుపోతాయి. కొన్ని వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొన్ని క్యాన్సర్ రూపంలో మారి ప్రాణాంతకంగా మారుతాయి. వీటిని ప్రాధమిక దశలో గుర్తించి నివారించడం అనేది అత్యవసరం. ఇలా తొలగిస్తే క్యాన్సర్ నుండి బయటపడవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

What is colon cancer? What causes colon cancer?

సాధారణంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ కు గల కారణాలు :
1. వంశ పారంపర్యంగా రావడం. 2. వయస్సు 50 సంవత్సరాలు దాటిన అనంతరం ఈ క్యాన్సర్ సోకెందుకు అధిక అవకాశాలు. 3. శరీరంలో మరే ఇతర తరహా క్యాన్సర్ కలగడం మూలంగా కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 4. ఎక్కువ మోతాదులో మాంసం వాటి సంబంధిత ఆహారాలను తీసుకోవడం. 5. అధిక బరువు కలిగి ఉండటం. పొట్ట పెద్దదిగా ఉండటం లేదా పొట్ట చుట్టూ కొవ్వు పెరుకుపోవడం.
6. తగినంత వ్యాయామం చేయకపోవడం. 7. అధిక మోతాదులో ధూమపానం మరియు మద్యపానం సేవించడం.

ఇక ఈ క్యాన్సర్ సోకే ముందు ఎటువంటి ముందు లక్షణాలు కనపడవని, తరచూ సంవత్సరానికి ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ను ముందుగా పసికట్టవచ్చని వైద్యులు తెలిపారు. కోలన్ క్యాన్సర్ లక్షణాలు పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన ప్రదేశం, దాని పరిమాణం, ఏయే భాగాలకు అది వ్యాపించింది వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కోలన్ క్యాన్సర్ మనం తీసుకొనే ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కోలన్ క్యాన్సర్‌ను నివారించడం సులువే. ఈ క్యాన్సర్ సోకే ముందు కొన్ని లక్షణాలను ఈ విధంగా గుర్తించ వచ్చు.

పెద్ద ప్రేగు క్యాన్సర్ కు గల కారణాలు :
1. మలవిసర్జన సమయంలో రక్తం కనిపించడం.
2. మలవిసర్జన సమయంలో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మల విసర్జన సాధారణంగా కలగకపోవడం.
3. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం.

ప్రధానంగా పోషక పదార్ధాలు కల పండ్లు, ఆకు కూరల ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవడం మూలంగా 45 నుండి 50 శాతం వరకూ ఇటువంటి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణుల సలహా. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అంటే... కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని పరిమితంగా తినడం అందులోనూ కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలను మాత్రమే తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలోనూ పీచు ఎక్కువగా ఉండే కాయధాన్యాల వంటివాటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

English summary

What is colon cancer? What causes colon cancer?

The colon is the longest part of the large intestine and the lowest part of the digestive system. Inside the colon, water and salt from solid wastes are extracted before the waste moves through the rectum and exits the body through the anus.
Story first published: Saturday, November 8, 2014, 11:38 [IST]
Desktop Bottom Promotion