Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
క్యాన్సర్ : చిన్న లక్షణాలే కదా అని నిరక్ష్యం చేయకూడదు....
క్యాన్సర్ మానవులు మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రాణాలు పోవడం ఖాయమనే భావన చాలామందిలో ఉంది. అయితే వ్యాధిని ముందుగా గుర్తిస్తే దాని నుంచి బయటపడటం సాధ్యమేనని అంటున్నారు వైద్యులు. క్యాన్సర్ అంటే ఒకప్పుడు చికిత్సే లేని రాచపుండు. కానీ ఇప్పుడు క్యాన్సర్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. చిన్నపాటి జాగ్రత్తలతో అసలు రాకుండా కూడా నివారించడం సాధ్యమే అవుతుంది. సిగట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, మద్యం తీసుకోవడం మానేయడం, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ రిస్కు ఎంత ఉన్నా దాన్ని చాలావరకు జయించినట్టే.
కొన్ని లక్షణాలు కేన్సర్‌కు సంకేతాలు కావచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి బాగా ముదిరిపోయి చికిత్సకు లొంగని పరిస్థితి రావచ్చు. కాబట్టి చిన్న చిన్న లక్షణాలే కదా అని వదిలేయకుండా వైద్యులను సంప్రదించాలి. అలాంటి లక్షణాలు కొన్ని....

బరువు తగ్గడం
డైటింగ్, వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతున్నట్లయితే ఫర్వాలేదు. కానీ ఆహారపు అలవాట్లు మార్చుకోకుండానే, ఏ కారణం లేకుండానే బరువు తగ్గుతున్నట్లయితే అనుమానించాల్సి ఉంటుంది. పాంక్రియాజ్, స్టమక్ వంటి కేన్సర్‌లలో బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది.

జ్వరం
ఎంతకీ విడవని జ్వరం లింఫోమా, ల్యుకేమియా వంటి బ్లడ్‌కేన్సర్‌లకు సంకేతం కావచ్చు. కాబట్టి జ్వరం తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకవేళ అది కేన్సర్ కాకపోయినా జ్వరం తగ్గేవరకు చికిత్స తీసుకోవడం మరువద్దు.

నొప్పి
నొప్పికి చాలా కారణాలుంటాయి. అయితే వదలకుండా ఉన్న తలనొప్పి బ్రెయిన్ కేన్సర్ సంకేతం కావచ్చు. నడుంనొప్పి రెక్టల్, ఒవేరియన్ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. ఒకవేళ విడవకుండా నొప్పి ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించి కారణం తెలుసుకోండి.

దగ్గు
చాలా రోజులుగా దగ్గు బాధిస్తోందా? అది లంగ్ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. సీజనల్ అలర్జీ వల్ల వచ్చిన దగ్గు కావచ్చు. కారణం ఏదైనా పరీక్ష చేయించుకోవడం మాత్రం మరువద్దు.

శరీరంలో గడ్డలు
శరీరంలో ఎక్కడైనా గడ్డల మాదిరిగా తగిలితే నిర్లక్ష్యం పనికిరాదు. బ్రెస్ట్, టెస్టికల్స్, లింఫ్ నోడ్స్ దగ్గర గడ్డల మాదిరిగా ఉంటే పరీక్ష చేయించడం ఉత్తమం.

రక్తస్రావం
అబ్‌నార్మల్ బ్లీడింగ్ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. దగ్గినపుడు కఫంలో రక్తం పడటం, మలంలో రక్తం పడటం, మూత్రంతో పాటు రక్తం రావడం, వెజైనల్ బ్లీడింగ్ వంటివి కేన్సర్‌కు సంకేతాలు.

ఎంతకీ మానని పుండు
ఒకవేళ పుండు ఎంతకీ తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌తో చెక్ చేయించుకోవాలి. నోట్లో పుండ్లు ఉన్నా ఓరల్ కేన్సర్ లక్షణం కావచ్చు.

చర్మంపై మార్పులు
ఒకవేళ పుట్టుమచ్చల్లో ఏమైనా మార్పులు కనిపించినా, చర్మంపై ఇతర మార్పులు కనిపించినా మెలనొమాకు సంకేతం కావచ్చు. కాబట్టి డెర్మటాలజిస్టును కలవాలి.

నీరసం
ఎప్పుడూ నీరసంగా ఉండటం కూడా కేన్సర్ సంకేతం కావచ్చు. చాలా మందిలో వివిధ కారణాల వల్ల నీరసం ఉంటుంది. ఒకవేళ రోజంతా నీరసంగా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

టెస్టిక్యులర్ మార్పుల:
టెస్టిక్యులర్స్(వృషణాలు) బరువుగా తెలిసినప్పుడు. ఒకదాని కంటే మరొకటి బరువుగా గుర్తించినప్పుడు(క్యాన్సర్) కు ప్రారంభ లక్షణంగా గుర్తించాలి. వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి.

యూరిన్ లో బ్లడ్:
ప్రొస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో అత్యంత ప్రాణాంతకమైన వ్యాది. పురుషల అండర్ వేర్ లో ఏదైన బ్లడ్ స్పాట్స్ లేదా రాషెస్ కనిపించినప్పడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

అజీర్తి మరియు పొత్తికడుపులో నొప్పి:
క్రోనిక్ ఇన్ డైజషన్ మరియు అబ్డోమినల్ పెయిన్, కడుపు నొప్పి వంటివి ప్యాంక్రియటిక్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి . ఈ క్యాన్సర్ ముక్యంగా స్మోకింగ్ వల్ల వస్తుంది.



Click it and Unblock the Notifications