Latest Updates
-
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్!
లివర్ (కాలేయ)వ్యాధులను ఉత్తమ చికిత్సనందించే 14 హోం రెమెడీస్
మన శరీరంలో అన్ని అవయవాల్లో కంటే పెద్ద అవయవం కాలేయం. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి ప్రధానంగా సహాయపడేది కాలేయం. ఇది ఎసెన్షియల్ న్యూట్రీషియన్స్ ను మెటబలైజ్ చేసిన శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇది తీసుకొన్న ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరం అయ్యే బైల్ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది . ఇది కొవ్వులు జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి. మనం జీవించడానికి ఈ అవయవం చాలా అత్యవసరమైనది.
అద్రుష్టవశాత్తు, కొన్ని ఎఫెక్టివ్ మరియు సురక్షితమైన హోం రెమెడీస్ ఉన్నాయి . ఇవి లివర్ ఫెల్యూర్(కాలేయ వైఫల్యం )లేదా కాలేయం వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి .
డెడ్ స్కిన్ సెల్స్ ను పునరుత్పత్తి పరచడానికి మరియు జీవక్రియలు క్రమంగా జరగడానికి కాలేయానికి ఆ లక్షణాలను ఎక్కువగా కలదు. అయితే, 75శాతం కాలేయ కణాలు డ్యామేజ్ అయితే మాత్రం ఇది పునరుత్పత్తి కణాలను రీజనరేట్ చేయలేదు. READ MORE: కాలేయంను శుభ్రపరిచే 14 ఎఫెక్టివ్ హోం రెమెడీస్
లివర్ వ్యాధులకు అనేక కారణాలున్నాయి . అందులో ఆల్కహాల్ తీసుకోవడం, వైరల్ ఇన్ఫెక్షన్ (హైపటీటీస్, )కొన్ని రకాల మందులుఎక్కువగా వినియోగించడం, విషపదార్థాలు(కెమికల్స్, పెస్టిసైడ్స్ )మొదలగునవి.
లివర్ డిసీజ్(కాలేయ వ్యాధి యొక్క లక్షణాలు)చర్మం మరియు గోళ్ళు పెలుసుగా మారడం, విటమిన్ల లోపం మరియు మినిరల్స్ లోపం, వాంతులు, వికారం, అలసట, విశ్రాంతి లేకపోవడం మరియు అజీర్ణం మరియు నీరసం వంటివి ఈ సమస్యకు ప్రధాణ కారణాలు. READ MORE: లివర్ డ్యామేజ్ కు 10 ప్రధాన లక్షణాలు..
లివర్ వ్యాధులను నేచురల్ గా నివారించడం ఎలా?బోల్డ్ స్కై కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను మీతో షేర్ చేసుకుంటున్నది . అవేంటో పరిశీలించి లివర్ ను దీర్ఘకాలం పాటు కాపాడుకుందాం...

మిల్క్ థిస్టల్
ఇది ఒక ఎఫెక్టివ్ మూలిక . హెపటీటిస్, ఆల్కహాల్ వాడకం, కెమికల్స్ వల్ల విషాహారంగా మారే ఆహారాలను తిన్నప్పుడు వచ్చే లివర్ సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ మూలిక.

ఆపిల్ సైడర్ వెనిగర్
లివర్ (కాలేయంలోని టాక్సిన్స్ ను శుభ్రం చేయడానికి సహాపడుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ వేసి , త్రాగాలి. మీరు ఇందులో కొద్దిగా తేనె కూడా మిక్స్ చేయవచ్చు . భోజనం చేయడానికి ముందు మూడు సార్లు త్రాగవచ్చు.

డాండలైన్ రూట్ టీ
ఈ మూలిక కాలేయ క్రియలను తిరిగి యథావిధిగా పనిచేయడానికి సహాయపడుతుంది. దాంతో లివర్ డ్యామేజ్ సమస్య ఉండదు . కొద్దిగా డాండలైన్ మూలికను నీటిలో వేసి నానబెట్టి, కొద్దిసేటి తర్వాత ఆ నీటిని త్రాగాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసంను మిక్స్ చేసుకోవచ్చు . లివర్ ఫెయిల్యూర్ కు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

ఇండియన్ గూస్బెర్రీ(ఆమ్లా)
ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఇది లివర్ ఫంక్షన్ ను రీస్టోర్ చేస్తుంది . రోజులో రెండు మూడు సార్లు ఆమ్లా జ్యూస్ ను త్రాగవచ్చు. లేదా ఉసిరికాయను తినొచ్చు.

లికోరైస్
లివర్ ఫెయిల్యూర్ కు లికోరైస్ ఒక ఉత్తమ హోం రెమెడీ. లికోరైస్ తో టీపౌడర్ ను తయారుచేసుకోవాలి. దీన్నిటీలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు త్రాగాలి. లివర్ వ్యాధులను నేచురల్ గా నివారించే మూలిక.

పసుపు:
ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇన్ ఫెక్షన్ మరియు ఇది కాలేయంలో టాక్సిన్ ను తొలగించే ఒక ఉత్తమ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మరియు ఇది లివర్ వ్యాధులకు దారితీసే వైరల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. ఇది హైపటైటీస్ ను నివారించడానికి సహాయపడుతుంది . తేనె మరియు పాలలో ఒక చెంచా మిక్స్ చేసి వెంటనే త్రాగాలి.

ఫ్లాక్స్ సీడ్స్:
కాలేయంలో టాక్సిన్స్ ను నివారిస్తుంది మరియు ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు లేదా సలాడ్స్ లో గార్నిష్ చేసితినవచ్చు. లివర్ వ్యాధులను నివారించే ఒక ఉత్తమ నేచురల్ పదార్థం..

బొప్పాయి జ్యూస్
ఇది కాలేయ వ్యాధులను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇది జీవక్రియలు తిరిగి యథావిధిగా పనిచేయడానికి సహాయపడుతుంది . బొప్పాయి జ్యూస్ కు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు.

ఆకుకూరలు మరియు క్యారెట్ జ్యూస్
లివర్ డ్యామేజ్ ను నేచురల్ గా ఎలా నివారించాలి. ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ . ఇది లివర్ డ్యామేజ్ ను చాలా నేచురల్ గా తగ్గిస్తుంది . ఆకుకూరలు, మరియు క్యారెట్ ను జ్యూస్ గా చేసి వాటిని మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ ను రోజూ రెండు సార్లు త్రాగాలి.

అవొకాడో మరియు వాల్ నట్స్
ఇందులో గ్లూటా థయోన్ పుష్కలంగా ఉండి ఇది లివర్ డ్యామేజ్ కలగకుండా రక్షణ కల్పిస్తుంది . ఇది కాలేయం నుండి టాక్సిన్స్ ను నివారించడానికి సహాయపడుతుంది . మరియు ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆపిల్స్ అండ్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్
కాలేయంలో ఉత్పత్తి అయ్యే పైత్య ఆమ్లాలలను సపరేట్ చేస్తుంది దాంతో కాలేయంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది . లివర్ డ్యామేజ్ కాకుండు కాలేయానికి రక్షణ కల్పిస్తుంది.

ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి
శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయాలన్నా మరియు లివర్ ను డిటాక్సిఫై చేయాలన్నా ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. 9-10గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.

వ్యాయామం
చిన్న పాటి వ్యాయామాలు శరీరంలో అవయవాలు యథావిధిగా పనిచేయడానికి అవసరంఅయ్యే శక్తిని అందిస్తాయి . కాలేయంతో సహా అన్ని అవయవాలు చురుకుగా పనిచేస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ ను చెమట రూపంలో బయటకు నెట్టి జీర్ణక్రియను పెంచుతాయి.

గ్రీన్ టీ
లివర్ వ్యాధులను నివారించడంలో ఇది ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ . . ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . లివర్ లోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి ఇది సహాయపడుతుంది . మీరు ఖచ్చితంగా రెండు కప్పుల గ్రీన్ టీని ప్రతి రోజు తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











