Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హైబిపి వల్ల ఆరోగ్యానికి కలిగే 15 ప్రమాధకరమైన దుష్ర్పభావాలు
హై బిపి వలన కలిగే ప్రభావాలు ఏమిటి? ఇది క్రమంగా మీ శరీరం యొక్క అనేక ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. మీరు ముందుగా దాని లక్షణాలను చూడండి. అది క్రమంగా మీ శరీరంలో సామరస్యపూర్వకమైన పనితీరుపై ప్రభావితం చేసి హఠాత్తుగా జీవితంలో ప్రమాదాన్ని పొందుతారు. హై బిపి ని సమర్ధవంతంగా ఎదుర్కోవటం ముఖ్యం.
నిజానికి, హై బిపిని కొన్ని జీవనశైలి మార్పుల సహాయంతో కొంచెం నియంత్రించవచ్చు. మీరు దానిని విస్మరిస్తే, అప్పుడు గుండెపోటు అవకాశాలు మరింత పెరుగుతాయి. క్లుప్తంగా చెప్పాలంటే, హై బిపి అనేది మీ శరీరంలో దాదాపు అన్ని భాగాలను ప్రభావితం చేస్తుంది. మీ నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అలాగే మీ మూత్రపిండాలు దెబ్బతింటాయి. మీ మెదడు మీద ప్రభావం చూపవచ్చు. మీ గుండెకు నష్టం జరగవచ్చు. ఇప్పుడు, హై బిపి యొక్క ప్రభావాలను లోతుగా పరిశీలన చేద్దాం.

ధమనులు
హై బిపి మీ ధమనుల యొక్క లైనింగ్ మీద ప్రభావం చూపుతుంది. ధమనులు గట్టిపడి నప్పుడు ధమనులు గట్టిపడే వ్యాధి సంభవించవచ్చు. మీ ధమనులు సరిగా పనిచేయక పోవటం వలన మీ శరీరంలో మెదడు,మూత్రపిండాలు మరియు గుండె వంటి శరీర భాగాలకు రక్తం సరఫరా బ్లాక్ అవుతుంది. క్రమంగా, అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మూత్రపిండ వైఫల్యం, గుండెపోటు, కంటి నష్టం వంటివి వస్తాయి.

హార్ట్ ఫెయిల్యూర్
కొన్ని సందర్భాల్లో, మీ గుండె యొక్క ఎడమ వైపు ఉబ్బి ఉండవచ్చు. హై బిపి అనేది మీ గుండెకు రక్తం సరఫరా చేయడానికి కఠినతరం చేస్తుంది. క్రమంగా, గుండె వైఫల్య ప్రమాదాన్నిపెంచుతుంది.

కాగ్నిటివ్ సమస్యలు
కాగ్నిటివ్ సమస్యలు వయస్సు వలన సంభవించవచ్చు. కానీ ఇది కూడా దెబ్బతిన్న ధమనుల కారణంగా సంభవించవచ్చు. హై బిపి వలన వచ్చే ఆగ్రహంతో మీ ధమనులు భయంకరముగా దెబ్బతినవచ్చు.

రక్త నాళము ఉబ్బుట
ఇది రక్త నాళాలు ఉబ్బటానికి కారణం అవుతుంది. ఈ పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది. రక్తపోటు కారణంగా దమని బలహీనంగా మరియు ఉబ్బు వలన ఇది సంభవిస్తుంది. ఈ పరిస్థితి అంతర్గత రక్తస్రావంనకు కారణం కావచ్చు.

చూపు మీద ప్రభావం
దృష్టి నాడులు దెబ్బ తిన్నప్పుడు మరియు రక్త ప్రసరణకు నిరోధం కలిగినప్పుడు, దీని వలన రక్తస్రావం జరిగి మరింత మీ దృష్టి మీద ప్రభావితం చూపే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం.

ఎముకలు
హై బిపి మీ అస్థిపంజర వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. మీ శరీరం నుండి కాల్షియం తొలగించినప్పుడు, మీ మూత్రపిండాల పనితీరు బలహీనం అవుతుంది. అప్పుడు మీ ఎముక సాంద్రత మీద ప్రభావం చూపుతుంది. హై బిపి కూడా మీ ఎముకల మీద ప్రభావం చూపుతుంది.

స్లీప్ అప్నియా
ఒక అధ్యయనం స్లీప్ అప్నియా అనేది హై బిపితో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటుందని సూచించింది. ఇది హై బిపి యొక్క దుష్ప్రభావాలలో ఒకటి. ఈ హై బిపి కూడా మీ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది.

కొరోనరీ ధమని వ్యాధి
కొరోనరీ ధమని వ్యాధికి కూడా కారణమవుతుంది. ఈ వ్యాధి మీ గుండె రక్త ప్రసరణను నిరోధించవచ్చు. ఇది ఛాతీ నొప్పి లేదా గుండెపోటుకు కారణం కావచ్చు.

గుండె మీద ఒత్తిడి
హై బిపి గుండె మీద అధిక ఒత్తిడికి కారణం అయ్యి,దాని సామర్థ్యంను కోల్పోతుంది. క్రమంగా, గుండె క్షీణించి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.

మినీ స్ట్రోక్
హై బిపి మెదడుకు రక్తం సరఫరాకు అంతరాయం కలిగించవచ్చు. ఒక మినీ- స్ట్రోక్ మరింత హెచ్చరిక గుర్తుగా ఉంటుంది. ఇది మీకు ఒక మేజర్ స్ట్రోక్ అనుభవించే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాలకు హాని కలిగించవచ్చు.

మెదడు
మీ మెదడుకు ఆక్సిజన్ తో పాటు పోషకాల సరఫరా కూడా అవసరం. సరఫరాకు ఆటంకం కలిగినప్పుడు ఏమి జరుగుతుంది? మీ మెదడు కణాలు చనిపోయే అవకాశం ఉంటుంది. హై బిపి మీ మెదడులోని రక్త నాళాలకు హాని కలిగిస్తుంది. రక్త ప్రవాహం బ్లాక్ అయినప్పుడు స్ట్రోక్ ఏర్పడవచ్చు. హై బిపి యొక్క ప్రభావాలలో మెదడు ఒకటి.

సెక్స్ జీవితం
హై బిపి మీ సెక్స్ జీవితాన్ని పాడుచేస్తుంది. ధమనులు సరిగా పని చేయనప్పుడు, వ్యక్తిగత భాగాలకు రక్త ప్రవాహం పరిమితం అవుతుంది. ఇది పురుషుల సెక్స్ జీవితాన్ని పాడుచేస్తుంది. నిజానికి, మహిళల్లో కూడా యోనికి తగినంత రక్తం సరఫరా లేనప్పుడు,సెక్స్ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

డిమెన్షియా
డిమెన్షియా అనేది మీ ఆలోచన, రీజనింగ్,దృష్టి మరియు చలనం మీద ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితుల వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ,వాటిలో ఒకటి అసమర్థమైన ధమనులు కావచ్చు. రక్త ప్రవాహంనకు సరైన మార్గం లేనప్పుడు, శరీరంలో ప్రతి చోట పనులు తప్పుగా జరుగుతాయి.

కిడ్నీ వైఫల్యం
హై బిపి కూడా మూత్రపిండాల వైఫల్యానికి కారణం అనే వాస్తవం మీకు తెలుసా? మీ మూత్రపిండాలు చుట్టూ ఉన్న ధమనులు దెబ్బతింటే, అది మీ మూత్రపిండాలకు దుర్వార్త అని చెప్పవచ్చు. మీ మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేయటంలో విఫలమైనప్పుడు, అవి కేవలం ఒక మార్పిడి కోసం డిమాండ్ చేస్తాయి. ఈ మూత్రపిండాలు హై బిపి యొక్క ప్రభావాలలో ఒకటి.

కళ్ళు
హై బిపి వలన మీ కళ్ళకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలు దెబ్బతింటాయి. అలా జరిగితే, అప్పుడు మీ దృష్టిలో కొంచెం బాధ ఉండవచ్చు.ఇది హై బిపి యొక్క దుష్ప్రభావాలలో ఒకటి.



Click it and Unblock the Notifications











