Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
తల తిరుగుడుకు విరుగుడుగా పనిచేసే హోం రెమెడీస్
ప్రస్తుత రోజుల్లో చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య తల తిరుగుడు. దీనినే వైద్య పరిభాషలో ‘వర్టిగో' అంటారు. సహజంగా కొంత మంది తల తిరుగుతోంది.. వాంతి వచ్చినట్టుగా ఉంది అంటుంటారు. దీన్నేవర్టిగో అంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. సబ్జెక్టివ్ వర్టిగో అంటే తనకు తాను తిరిగినట్టు అనిపిస్తుంది. ఆబ్జెక్టివ్ వర్టిగో అంటే ఎదురుగా కనిపించే వస్తువులు తిరిగినట్టు అనిపిస్తాయి.
కొందరిలో కిందికి లాగినట్టు, పక్కకు లాగినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పొజిషన్ మారినప్పుడు, తల తిప్పినప్పుడు, పడుకున్నప్పుడు ఇది ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటరిగా ఎటు వెళ్ళలేక భయపడుతుంటారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది కాని ఈ సమస్యను అనుభంవిచేవారి బాధ ఇంతా అంతా కాదు.. ఉదయం నిద్ర లేవగానే మొదలవుతుంది. ఈ సమస్య నిద్రనుంచి లేసి ప్రక్కకు తిరిగినప్పుడు, రోడ్డుమీదికి వెళ్లి నడుస్తున్నప్పుడు, ఆఫీసులో కూర్చుండి విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉన్నట్టుండి తల తిరుగుతుంది. కొన్ని సందర్భాలలో తూలిపడిపోవడం కూడా జరుగుతుంది.
READ MORE: అనీమియా (రక్తహీనత) లోపంను నివారించే 18 హోం రెమెడీస్
ఈ వర్టిగో సమస్యను నివారించుకోవడానికి చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. అందుకు మీకు చాలా సింపుల్ గా రెస్ట్ కావాలి. వీటితో పాటు కొద్దిగా రెస్ట్ తీసుకొన్నట్లైతే వర్టిగో సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చు. డైట్ లో మార్పులు చేసుకోవడం వల్ల శరీరంలో తగినంత తేమను అందివ్వవచ్చు . శరీరంను ఎనర్జిటిక్ గా మార్చుకోవచ్చు.

వర్టిగో లక్షణాలు:
చెవిలో సమస్య ఉన్నప్పుడు తల తిప్పినా, పడుకున్నా వస్తుంది. వినికిడి సన్నగిల్లడం, శబ్దాలు, చెవిలో భారంగా, మూసినట్టు ఉంటుంది. ఇంతేకాకుండా కళ్లు మసక, నీరసం, తలనొప్పి, గుండెదడ, నిలబడలేకపోవడం, ఏకాక్షిగత లోపం, నడిచినా, నిలబడినా పడిపోతున్నట్టు ఉండటం, వికారం, వాంతులు ఉంటాయి, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఎక్కువ శబ్దం, వెలుతురు భరించలేరు. చెమటలు ఎక్కువగా ఉంటాయి.

నిద్ర:
వర్టిగో సమస్యతో బాధపడుతున్నట్లైతే సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా సరైన నిద్రను పొండం చాలా ముఖ్యం . వర్టిగో సమస్యను నేచురల్ గా తగ్గించుకోవాలంటే మంచి నిద్ర చాలా అవసరం.

సీడ్స్:
బాదం మరియు వాటర్ మెలో సీడ్స్ తలతిరుగుడుకు బెస్ట్ హోం రెమెడీస్ . ఇలాంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది . ఈ సమస్య నుండి బయట పడాలంటే మరో హోం రెమెడీ గసగసాల కూడా ఉపయోగపడుతాయి. ఒక గ్లాసు నీళ్లలో వాటర్ మెలోన్ విత్తనాలు, గసగసాలు, బాదం మరియు ఒక త్రుణధాన్యాలు నానబెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వడగట్టి త్రాగడం వల్ల వర్టిగో సమస్య నుండి బయటపడవచ్చు.

జ్యూస్:
అధికంగా ఫైబర్ ఉన్న పండ్ల రసాలను త్రాగాలి . ఇది మీకు అవసరం అయ్యే ఎనర్జీని అంధిస్తుంది. మీ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం . తరచూ నీరు త్రాగుతుండాలి.

బెర్రీస్:
తాజాగా మరియు పండిన స్ట్రాబెర్రీలను తీసుకొని, పెరుగులో వేసి బాగా మెత్తగా చేత్తో గుజ్జలా చేయాలి. ఇలా చేసిన తర్వాత నేరుగా తినేసేయాలి. ఇది వర్టిగో సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా త్వరగా హెల్తీగా కోలుకొనేలా చేసి ఒక సులభహోం రెమడీ.

హెర్బ్స్:
ఇండిగో అండ్ బుచ్చర్స్ బ్రూమ్ ఈ రెండు మూలికలు తలతిరుగుడును నివారిస్తుంది. వీటిని టీలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల త్వరగా రిలీఫ్ అవుతుంది.

బాదం మిల్క్:
బాదంలో 26శఆతం కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఇ, బి, మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, బాదంలను కొన్నింటిని తీసుకొని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వీటి పొట్టు తీసి, మెత్తగా పేస్ట్ చేసి వేడి పాలు లేదా నీళ్ళలో వేసి, మిక్స్ చేసి త్రాగాలి. వర్టిగోకు ఒక బెస్ట్ హోం రెమడీ.

అల్లం:
అల్లం టీని త్రాగాలి. లేదా కొద్దిగా పచ్చి అల్లంను నములుతుండాలి. ఇది వర్టిగో సంబంధిత తలతిరుగుడ, వికారంను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications