Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఎక్కిళ్ళను చిటికెలో మాయం చేసే టిప్స్ అండ్ ట్రిక్స్
సాధారణంగా గబగబా భోజనం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్ళు రావడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా వేగంగా తినడం వల్ల లేదా తినేటప్పుడు పీల్చుకొనే గాలి వేగంలో తేడా రావడం వల్ల డయాఫ్రమ్(గుండెను, పొత్తికపడును వేరుచేసే సన్నని పొర)సంకోచిస్తుంది. దీని వల్ల గాలి లోపలికి పీల్చుకొనేటప్పుడు గొంతులోని నాళాలు మూసుకుపోయి 'హిక్...హిక్' అనే శబ్దం వస్తుంది. అందుకే దీన్ని ఆంగ్లంలో hiccups అంటారు.
ఇవి వస్తున్నంత సేపు సరిగా మాట్లాడలేకపోవడం, పనిపై మనసు లగ్నం చేయలేకపోవడం వంటివి జరగుతుంటాయి. కాబట్టి, వీటిని తగ్గించుకోవడానికి కొందరు నీళ్ళు త్రాగుతుంటారు. దీని వల్ల శ్వాసక్రియ రేటులో తిరిగి మార్పు రావడం వల్ల ఎక్కిళ్ళు ఆగిపోయితాయి. ఈ క్రమంలో అదే పనిగా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఆగిపోవడానికి కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.....

స్పైసీ సాస్:
ఎక్కిల్లు తగ్గించడానికి బెస్ట్ హోం రెమెడీ. స్పైసీ సాస్ ను నోట్లో వేసుకొని మింగాలి. ఈ సాస్ టేస్ట్ బడ్స్ కు చీకాకు కలిగిస్తుంది . ఇది హార్ట్ బర్నింగ్ టంగ్ ను డైవర్ట్ చేస్తుంది.

తేనె:
ఒక టీ స్పూన్ తేనెను నాలుక మీద వేసుకొని చప్పరిస్తూ మింగాలి. ఇది నేచురల్ అండ్ ఫవర్ ఫుల్ హోం రెమెడీ.

కోక పౌడర్:
ఎక్కిళ్ళు వచ్చే సమయంలో కోక పౌడర్ ను నోట్లో వేసుకొని మింగాలి . ఇది శ్వాస నాళాన్ని విశ్రాంతి పరుస్తుంది.

నాలుకను బయటకు పెట్టాలి:
ఇలా ట్రిక్ ప్రదర్శించడం వల్ల ఎక్కిళ్ళు చిటెకెలో మాయం అవుతాయి . నాలుకను ఇలా పొడవుగా బయటకు చాచి రెండు మూడు నిముషాలు అలా ఉంటే చాలు, ఎక్కిళ్ళు మాయం అవుతాయి.

స్వీట్ లేదా షుగర్ :
నోటి నుండి గొంతు వరకు ఉండే ఈసోఫగస్ చికాకు తొలగించే చక్కటి హోం రెమెడీ. సమయం లేనప్పుడు ఇలాంటి ట్రిక్స్ పదర్శించవచ్చు. నోట్లో చిటికెడు చెక్కర లేదా స్వీట్ తినడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్:
ఎక్కిళ్ళు వచ్చే సమయంలో నిమ్మరసాన్ని చప్పరించడం లేదా టీస్పూన్ వెనిగర్ ను నోట్లో వేసుకొని మింగడం ద్వారా వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

అల్లం:
చాలా మంది అల్లం వంటల్లో వేస్తేనే తినడానికి ఇష్టపడరు. మిర నేరుగా తినడానికైతే అస్సలు ఇష్టపడరు. కానీ దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే ఎక్కిళ్ళను కూడా తగ్గించుకోవచ్చు. దీనికోసం ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని నిమ్మదిగా నమలాలి. ఫలితంగా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.



Click it and Unblock the Notifications
