నైట్ విజన్ (రేచీకటి ) దూరం చేసే హెల్తీ ఫుడ్స్

రాత్రిపూట చూపు ఆనకపోవడాన్ని " రేచీకటి " అంటారు . ఇది రెండు కారణాలు వల్ల వస్తుంది . 1. విటమిన్‌ ' ఎ ' లోపము వల్ల , 2. వంశపారంపర్యము గా సంక్రమించే " రెటినైటిస్ పిగ్మెంటోజా " వ్యాది వల్ల . విటమిన్‌ ఎ లోపము వల్ల కలిగే రేచీకటిని పోగొట్టుకోవచ్చును . వంశపారంపర్యము గా వచ్చే రేచీకటికి సరైన చికిత్సలేదు . వంశము లో ఎవరికైనా రెటినైటిస్ పిగ్మెంటోజా వుంటే వారిలో మేనరికపు వివాహాలు చేసుకోకూడదు .

రేచీకటి ఉన్నప్పుడు రాత్రుల్లో నడవడానికి మరియు డ్రైవింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. టీవీ చూడం కూడా సమస్యగా మారుతుంది. రేచీకటి ఉన్నప్పుడు కళ్లు బ్లర్ గా కనబడుతాయి. ముఖ్యంగా నైట్ టైమ్ చాలా ఇబ్బంది పడుతుంటారు . ఈ సమస్యల్లో ఓ ఒక్కటో లేదా అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? మరి అయితే మీరు నైట్ విజన్ రేచీకటి సమస్యతో (నైట్ బ్లైండ్ నెస్ లేదా నిక్టలోఫియాతో)బాధపడుతున్నట్లు గుర్తించాలి.

కంటి పవర్ ను పెంచే టాప్ 20 ఫుడ్స్

ఈ రేచీకటి సమస్య వివిధ కారణాల వల్ల వస్తుంది. కానీ చాలా ముఖ్యంగా విటమిన్ ఎ లోపం వల్ల వస్తుంది. ముఖ్యంగా ఇది పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది.
రెటినైట్స్ పిగ్మెంటోస, హెరిడోమాక్యులర్ డీజనరేషన్, కాంగ్నిటల్ స్టేషనరీ, రేచీకటి, మొదలగునవి పుట్టిన బిడ్డ నుండి పెరిగే పిల్లల వరకూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారికి డైటరీ సప్లిమెంట్ , లో విజన్ డివైసిస్ , జెనెటిక్ కౌన్సింగ్ మొదలగున వాటికి సహాయపడుతుంది.

వందేళ్ళ కంటి చూపుకు.. టాప్ టెన్ బెస్ట్ ఫుడ్స్...

ఇంట్రోక్యులర్ ప్రెజర్ వల్ల తక్కువ కంటి చూపు లేదా రాత్రుల్లో కంటి చూపు మీద తీవ్ర ప్రభావం చూపతుుంది . ఇటువంటి పరిస్థితిలో కంటి చెకప్ చేయించుకోవడం మంచిది. అలాగే డయాబెటిస్, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఒక్కరుగా పనిచేసే వారిలో కూడా ఇలాంటి సమస్య ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే కొన్ని రకాల కాంటరాక్ట్స్ వల్ల కూడా రాత్రుల్లో కంటి చూపుకు కష్టం అవుతుంది. అటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా స్పెషలిస్ట్ ను కలిసి, వారి సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

కంటి చూపును మెరుగుపరిచే ఉత్తమ హోం రెమెడీలు

ఏదేమైనా ముఖ్యమైన విషయమేమిటంటే 'రేచీకటిని (నైట్ విజన్)ను మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? మనం కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మరియు ఫిష్ వంటివని ఇష్టమున్నా లేకపోయినా మన కంటి ఆరోగ్యం కోసం రెగ్యులర్ గా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలుండవు. ఐసైట్ రాకుండా నివారించడానికి అదేవిధంగా మన టేస్ట్ బడ్స్ ను సాటిస్ఫై చేయడానికి సరిపోయే కొన్ని ఆహారాలను ఈ క్రింది లిస్ట్ లో లిస్ట్ అవుట్ చేయడం జరిగింది . అలాంటి కొన్ని రకాల ఫుడ్స్ మన కంటికి కంటి చూపుకు ఏవిధంగా సహాయపడుతాయో చూద్దాం...

రెగ్యులర్ డైట్ లో గ్రీన్ వెజిటేబుల్స్:

రెగ్యులర్ డైట్ లో గ్రీన్ వెజిటేబుల్స్:

లీఫ్ గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, మొలకలు, క్యాబేజ్ మరియు బీట్ రూట్ వంటివి చేర్చుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎను పుష్కలంగా పొందవచ్చు . ఇది కంటిలోని కార్నియాకు రక్షణ కల్పిస్తుంది. నైట్ విజన్ మెరుగుపరుస్తుంది. సలాడ్ లేదాసూప్స్ రూపంలో గ్రీన్ వెజిటేబుల్స్అధికంగా తీసుకోవాలి.

 రేచీకటిని దూరం చేసే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్:

రేచీకటిని దూరం చేసే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్:

విటమిన్ సి అధికంగా ఉండే బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్, దానిమ్మ, జామ, ద్రాక్ష, కివి ఫ్రూట్స్, పైనాపిల్, జామ, మొదలగునవి అధికంగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ సికి పవర్ హౌస్ వంటిది ద్రుష్టిలోపాలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్ లేదా మిల్క్ షేక్స్ తయారుచేసి ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు.

 డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్:

హెల్తీ స్నాక్స్ మంచి కంటి చూపును అందిస్తాయన్న విషయం మీకు తెలుసా . డ్రై ఫ్రూట్స్ లో బాదం, ఆప్రికాట్, వాల్ నట్స్ మరియు డేట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండే విటిమన్ ఇ కూడా అధికంగా ఉన్నాయి. ఈ రెండూ రేచీకటి నివారించడంతో పాటు , మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి.

సెరెల్ మీల్స్:

సెరెల్ మీల్స్:

ఓట్స్, మిల్లెట్స్, బార్లీ మొదలగునవి పొట్టనింపడం మాత్రమే కాదు . ఐసైట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ . ఈ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలన్నీ పరిష్కరింపబడుతాయి

 తక్కువ కెఫిన్ ఉన్నడ్రింక్స్ మరియు గ్రీన్ టీ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది:

తక్కువ కెఫిన్ ఉన్నడ్రింక్స్ మరియు గ్రీన్ టీ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది:

కెఫిన్ అధికంగా ఉండే కాఫీ తాగడం వల్ల ఎక్స్ ఫోలియేషన్ గ్లూకోమా డెవలప్ అవ్వడానికి ప్రమాధకరంగా సూచిస్తుంది . గ్రీన్ టీ తీసుకోవడం ఆక్సిడేటివ్ స్ట్రె నుండి విముక్తి కలిగిస్తుంది. ఇందులో విటమిన్ సి , ఇ, మరియు కెటచిన్స్ అధికంగా ఉండటం వల్ల రేచీకటి నివారించబడుతుంది.

 పాలు :

పాలు :

పాలలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది నైట్ విజన్ మెరుగుపరచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా అవసరం . కొన్ని పరిశోధనల ద్వారా మహిళల్లో విటమిన్ డి అధికంగా ఉన్నట్లైతే వయస్సైన తర్వాత కూడా నైట్ విజన్ సమస్యలకు సంబంధించిన మాస్కులర్ డీజనరేషన్ లోపాలుండవని పరిశోధించారు .

నైట్ విజన్ మెరుగుపరిచే ఫిష్:

నైట్ విజన్ మెరుగుపరిచే ఫిష్:

సీఫిష్ లో సాల్మన్ మరియు ఇండియన్ రాస్, ఇండియన్ మెకరెల్ , సార్డిన్స్ , తున మొదలగు వాటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది మాస్కులార్ డీజనరేషన్ మరియు డ్రై ఐస్ సిండ్రోమ్ నుండి రక్షణ కల్పిస్తుంది. దాంతో నైట్ విజన్ మెరుగుపడుతుంది . ఇంకా ఓయిస్ట్రెస్, షెల్ ఫిస్, మొదలగు వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ ఎ గా మారడానికి సహాయపడుతుంది.

క్యారెట్:

క్యారెట్:

బ్రైట్ ఆరెంజ్ వెజిటేబుల్స్ క్యారెట్ కంటి చూపుకు గ్రేట్ గా సమాయపడుతుంది. డార్క్ సెరెల్స్ కూడా గ్రేట్ గా హెల్ప్ అవుతాయి . బీటా కెరోటీన్ విటమిన్ ఎగా మార్పుచెందుతుంది . మరో బెస్ట్ ఫుడ్ నైట్ విజన్ ను మెరుగుపరుస్తుంది. వీటిలో బీటాకెరోటిన్ అధికంగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఉండటం వల్ల స్వీట్ పొటాటో, స్క్వాష్ మరియ గుమ్మడి వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

Desktop Bottom Promotion