Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించే హోంమేడ్ రెసిపీస్
ఆహారాలు, రసాలు,ప్రకృతి ఇచ్చిన మందులు మరియు సహజ చికిత్సలు సిస్టిటిస్ (సాధారణంగా మూత్రాశయ సంక్రమణం వల్ల వచ్చే మూత్రాశయం యొక్క వాపు), మూత్ర మరియు పిత్తాశయము ఇన్ ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి.
మూత్రాశయం లైనింగ్ కు అంటుకుని ఉండే బాక్టీరియాను నిరోధించడానికి ప్రోయాంతోసైనిన్లు సమృద్దిగా ఉన్న క్రాన్బెర్రీ లేదా బ్లూ బెర్రీ జ్యూస్ ను త్రాగాలి. రాస్బెర్రి,స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ఆకుకూరల రసం మరియు దోసకాయ రసం వంటి వాటిలో ఉన్న ప్రయోజనాలు సిస్టిటిస్ మరియు UTIs చికిత్సలో బాగా సహాయపడతాయి.
కాబట్టి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగి రోజుని ప్రారంభించండి. నిమ్మకాయ రసం రక్తం మరియు మూత్ర మార్గము యొక్క pH స్తాయిల మార్పుకు కారణమైన బాక్టీరియా వ్యాప్తిని తగ్గిస్తుంది. ఈ పరిస్థితి లేదా యుటిఐ యొక్క పునఃస్థితి ఆపటానికి మరియు ఆ పరిస్థితి తర్వాత కూడా ఇతర ఆహారాల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. కొన్ని ఆహారాలను అనుసరిస్తే సిస్టిటిస్ బాధితులకు మంచి ఉపశమనం కలుగుతుంది.
కొన్ని ఆహారాలు ఉపశమనానికి మరియు అంటువ్యాధుల సంకేతాలను నయం చేస్తే, కొన్ని ఆహారాలు పరిస్థితిని ఉదృతం చేస్తాయి. సిస్టిటిస్,మూత్ర మరియు పిత్తాశయము అంటువ్యాధుల సమస్యలు ఉన్నప్పుడు అనేక సహజ చికిత్సల ద్వారా ఉపశమనం పొందవచ్చు. రోజువారీ పదార్దాలను ఉపయోగించి ఆహారాలను మీరే సిద్దం చేసుకోవచ్చు. కాబట్టి, యుటిఐ వదిలించుకోవటం కొరకు కొన్ని ఇంటి వంటకాల తయారి గురించి తెలుసుకుందాం.

పాలకూర జ్యూస్, కొబ్బరి నీరు
పాలకూరను సలాడ్ రూపంలోనూ,జ్యూస్ రూపంలోనూ మరియు క్యాప్స్యూల్ రూపంలోను తీసుకోవచ్చు. పాలకూర రసం మరియు కొబ్బరి నీటిని సమాన బాగాలలో తీసుకోని కలపాలి. ఈ జ్యూస్ ని రోజులో మూడు సార్లు త్రాగాలి.

దోసకాయ జ్యూస్, నిమ్మకాయ, తేనే
ఈ కూరగాయల జ్యూస్ సిస్టిటిస్ మరియు మూత్రాశయ వ్యాధుల చికిత్సలో సహాయపడతాయి. ఒక కప్పు దోసకాయ రసంలో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ జ్యూస్ ని రోజులో మూడు సార్లు తీసుకోవాలి.

పచ్చి కూరగాయలు, పండ్లు
సిస్టిటిస్ సమస్య ఉన్నప్పుడు క్యారట్, ఆకుకూరలు, దోసకాయ, పాలకూర వంటి పచ్చి కూరల రసాలను ప్రతి రోజు త్రాగాలి. సిస్టిటిస్ మరియు పిత్తాశయము అంటువ్యాధుల సమస్యలు ఉన్నప్పుడు ప్రధానంగా పండ్లు మరియు కూరగాయలను తీసుకోవాలి.

వెల్లుల్లి:
యూరినరీ ఇన్ఫెక్షన్ నివారించడంలో పచ్చివెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, పచ్చిగా తీసుకోవచ్చు. నురుగా తినలేని వారు గార్లిక్ క్యాప్స్యూల్స్ తీసుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్
ఒక టేబుల్ స్పూన్ తేనెతో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి ప్రతి రోజూ తీసుకోవాలి.

విటమిన్ సి:
యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీలలో అసిడిక్ లెవల్స్ ను తొలగిస్తుంది . కాబట్టి ప్రతి రోజూ ఆరెంజ్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

బేకింగ్ సోడ
నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీళ్ళలో వేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. Show Thumbnail



Click it and Unblock the Notifications
