Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పీరియడ్స్ లో వచ్చే సమస్యలూ ఆరోగ్య సమస్యలకు సూచనలే...!
మహిళల్లో ప్రతి నెలా బాధించే సమస్య పీరియడ్స్. ఈ సమస్య ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య. అయితే ఆ సమయంలో చాలామందికి కడుపునొప్పి, చికాకు, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటిని కూడా చాలా సహజమైన విషయాలుగానే మనం పరిగణిస్తాం.
కానీ ఇలా బహిష్టు సమయంలో మనకు శారీరకంగా ఎదురయ్యే సమస్యలు మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణలు . మరి ఏ లక్షణాలు ఏఏ ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నాయో ఓసారి తెలుసుకుందామా...

నొప్పి ఎక్కువైతే :
నెలసరిసమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం చాలా సహజమైన విషయంగానే మనం పరిగణిస్తూ ఉంటాం. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు చాలా మంది పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచి పద్దతి కాదు. సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా నొప్పి వస్తున్నట్లైతే అది ఎండో మెట్రియోసిస్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 7నుండి 10శాతం మంది మహిళలు ఈ సమస్యతోనే బాధపడుతున్నారు. కాబట్టి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువగా వస్తున్నట్లైతే వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

రక్తస్రావం:
పీరియడ్స్ సమయంలో సాధారణ స్థాయిలో అయ్యే రక్తస్రావం కన్నా ఎక్కువగా అవుతుంటే అది రక్తహీనతకు సూచనగా భావించాలి. అలాగే కొన్ని సందర్భాల్లో అది ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ సమస్య కూడా కావచ్చు. వీటి వల్ల గర్భధారణ సమయంలో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే రక్తస్రావం మరీ తక్కువగా ఉంటే అది ఎనీమియాతో పాటు హార్మోన్ల అసమతౌల్యానికి సూచన. పిసీఓస్ సమస్య ఉన్నా రక్తస్రావం తక్కువగా అవుతుంది. కాబట్టి నిపుణులను సంప్రదించి వారి సూచనల మేరకు నడచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చికిత్సతో పాటు సౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి.

రంగూ ముఖ్యమే:
బహిష్టు సమయంలో శరీరం నుండి బయటకు వచ్చే రక్తం రంగు కూడా మన హార్మోన్ల పనితీరు తెలియజేస్తుంది. రక్తం రంగు ఎర్రగా ఎన్నట్లైతే శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు సమతౌల్యంగా ఉన్నాయని అర్ధం. అదే ఈ రంగు లేతగా ఉన్నా లేదా ముదురు రంగులో ఉన్నా ఈస్ట్రోజెన్ స్థాయిలో హెచ్చుతగ్గులున్నట్లే. రక్తం రంగు లేతగా ఉన్నట్లైతే శరీరంలో ఈస్టోజెన్ తక్కువ విడుదలవుతుందనడానికి సూచన. అదే ముదురుగా ఉన్నట్లైతే అవసరమైన దానికంటే ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నట్లు భావించాలి.

పిరియడ్స్ తర్వాత:
కొంత మందికి నెలసరి పూర్తయిన కొన్ని రోజుల తర్వాత బ్లీడింగ్ అవుతుంది. గర్భ నిరోధక మాత్రలు వాడుతున్న వారిలో అయితే దీన్ని సాధారణమైన అంశంగానే భావించవచ్చు. అయితే మాత్రలు వాడని వారిలోనూ ఇలాగే జరుగుతున్నట్లైతే అది వెజైనల్ ఇన్ఫెక్షన్లకు సూచనగా భావించవచ్చు. కొంతమందిలో అది క్యాన్సర్ కి సంబంధించిన సూచన కూడా కావచ్చు. కాబట్టి పీరియడ్స్ కి, పిరియడ్స్ కి మధ్యలో రక్తస్రావం అవుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

రుతుచక్రం:
సాధారణంగా పిరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి మళ్లీ బహిష్టు వచ్చేంత వరకు పట్టే కాలాన్ని రుతుచక్రంగా పరిగణిస్తారు. ఇది సాధారణంగా 28 నుంచి 35రోజులుగా ఉంటుంది. అలాగే బహిష్టు సమయంలో రక్తస్రావం 3 నుండి 7 రోజులకు వరకూ ఉంటుంది. మొదటి రెండు నుంచి మూడు రోజులు కాస్త ఎక్కువగా మిగిలిన రోజులు తక్కువగా రక్తస్రావం అవుతుంది. ఈ రెండు అంశాల్లోనూ ఎలాంటి తేడా లేకపోయినా..ఏ సమస్యా లేనట్లుగానే భావించాలి. ఒక వేళ సమస్య ఉన్నట్లు మీరు గుర్తిస్తే వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

పాలీసిస్టిక్ ఓవరీ:
ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలలో ఈ సమస్య ఉంది. అండాశయంలో పాలీసెస్టిక్ ఓవేరీ ఉండటం వల్ల రుతుక్రమంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. ఒక్కోక్కోసారి వంధ్యత్వాని(పిల్లలు పుట్టకపోవడాని)కి కూడా కారణం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల హానికరమైన కొవ్వులను పీరియడ్స్ లో హెచ్చుతగ్గులను నివారించడానికి సహాయపడుతుంది.

మానసిక ఆందోళన
ఈ మానసిక కల్లోలం రుతుక్రమంలోనూ మరియు మోనోపాజ్ దశలోను అధికంగా ఉంటాయి. కాబట్టి ఒమేగా 3ఫ్యాటీయాసిడ్స్ తీసుకోవడం వల్ల మెదడులో సానుకూల ఆలోచనలు ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications