For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ ను నివారించే 8 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ తో పాటు, బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

|

సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి సహజం. ఈ ఇన్ఫెక్షన్స్ మగవారితో పోల్చితే ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. ఆడవారిలో ఇన్ఫెక్షన్స్ వివిధ రకాలుగా ఉంటాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ లో బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి. సహజంగా పాలిచ్చే తల్లుల్లో బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు చాలా మంది ఉంటారు . అంతే కాదు, డయాబెటిక్ పేషంట్స్ కూడా బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటారు.వ్యాధినిరోధకత తక్కువగా ఉన్నవారు, రీసెంట్ గా బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న వారిలో కూడా బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ సహజం .

8 Effective Home Remedies For Breast Infection

ఇటువంటి పరిస్థితితో చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అయితే మొదట మనకు వచ్చే ఆలోచన బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ కు ఏవిధంగా ట్రీట్ చేయాలి ? చికిత్స ద్వారా తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. అయితే, సమస్య మైనర్ గా ఉన్నట్లైతే , బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ ను హోం రెమెడీస్ తో నివారించుకోవచ్చు. హోం రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

అయితే ముందు గా బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ కు ఖచ్చితమైన కారణాలు ఏంటో తెలుసుకోవాలి? బ్రెస్ట్ వద్ద చర్మం పగుళ్ళలోకి, నిప్పల్స్ (చనుమెన)లోకి బ్యాక్టీరియా చేరినప్పుడు వాపు, పెయిన్, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది.

భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!

బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ కు ముఖ్య లక్షణాలు- బ్రెస్ట్ పెయిన్, బ్రెస్ట్ స్వెల్లింగ్, బర్నింగ్ సెన్షేషన్, బ్రెస్ట్ ప్రాంతంలో రెడ్ నెస్, చాతీలో సలుపు, సాప్ట్ గా మారడం వంటి లక్షణాలు కనబడుతాయి. మరి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ తో పాటు, బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీబయోటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది బ్యాక్టీరియాకు వ్యతిరేఖంగా పనిచేస్తాయి. రెండు వెల్లుల్లి రెబ్బలను ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో కూలింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలోవెరలీఫ్ తీసుకుని, అందులో జెల్ ను వేరుచేసుకోవాలి. ఈ అలోవెర జెల్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రోజుకు రెండు, మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్, నొప్పికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, కొద్దిగా తేనె మిక్స్ చేసి, రోజుకు రెండు మూడు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్ :

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్ :

ఒక వాటర్ బ్యాగ్ తీసుకుని, అందులో హాట్ వాటర్ పోసి, వాటర్ బ్యాగ్ ను టవల్లో చుట్టి, ప్రభావితం ప్రాంతంలో కాపడంలా పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఇలా చేసిన తర్వాత అదే పద్దతిలో కోల్డ్ కంప్రెసర్ ను వ్రాప్ చేసి పెట్టుకోవాలి. 5 నిముషాల తర్వాత తీసేయాలి. ఇలా రోజులో మూడు, నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వాపు, ఇన్ఫ్లమేషన్, నొప్పి కి కారణమయ్యే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

క్యాబేజ్ ఆకులు:

క్యాబేజ్ ఆకులు:

క్యాబేజ్ లీవ్స్ లో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్, బ్రెస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కొన్ని క్యాబేజ్ లీవ్స్ తీసుకుని, రిఫ్రిజరేటర్ లో ప్లేస్ చేయాలి. కొద్ది సేపయ్యాక వాటిని బయటకు తీసి , ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్ది సేపు అలాగే ఉంచి, తర్వాత తొలగించాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 వార్మ్ షవర్ :

వార్మ్ షవర్ :

వార్మ్ వాటర్ తో షవర్ చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది. బ్రెస్ట్ సాప్ట్ నెస్ ను తగ్గిస్తుంది.

మెంతులు :

మెంతులు :

మెంతులు ఇన్ఫ్లమేషన్ కు కారణమయ్యే ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని, నీళ్ళలో వేసి బాగా మరిగించిన, వడగట్టి చల్లార్చి, రోజుకు రెండు మూడు సార్లు కొద్దిగా కొద్దిగా తాగితే మంచి ఫలితం ఉంటుంది.

విటమిన్ సి :

విటమిన్ సి :

రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి జోడించడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

English summary

8 Effective Home Remedies For Breast Infection

There are certain home remedies that help in curing breast infections effectively. A few of these home remedies are explained in this article.
Story first published: Thursday, January 5, 2017, 10:30 [IST]
Desktop Bottom Promotion