Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మీరు కచ్చితంగా ప్యానిక్ ఎటాక్ కు గురై ఉంటారు!
ప్యానిక్ ఎటాక్, హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుని జాగ్రత్తలు పాటించడం చాలా మేలు. చాలా మంది ఎక్కువగా హార్ట్ ఎటాక్ మాదిరిగా ఉండే ప్యానిక్ అటాక్ కు గురవుతుంటారు.
చాలా మంది నేడు హార్ట్ ఎటాక్, ప్యానిక్ అటాక్ వల్ల ఇబ్బందిపడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది హార్ట్ ఎటాక్, ఏది ప్యానిక్ అటాక్ అనేది చాలామందికి తెలియడం లేదు. కొంతమందికి వీటి గురించి పూర్తి అవగాహన లేకపోవడం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతోంది.ప్యానిక్ ఎటాక్, హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుని జాగ్రత్తలు పాటించడం చాలా మేలు. చాలా మంది ఎక్కువగా హార్ట్ ఎటాక్ మాదిరిగా ఉండే ప్యానిక్ అటాక్ కు గురవుతుంటారు. దాని గురించి తెలుసుకుని జాగ్రత్తపడితే మేలు.

హార్ట్ ఎటాక్
ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచనే అవుతుంది. శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు కూడా హార్ట్ ఎటాక్ లో ఉంటాయి. చెమటలు ఎక్కువగా వస్తున్నా హార్ట్ ఎటాక్ కారణం కావొచ్చు.

ఈ లక్షణాలు కూడా
గ్యాస్, అసిడిటీ వంటివి తరచూ వస్తున్నా, కడుపు నొప్పి వస్తున్నా హార్ట్ ఎటాక్ లక్షణాలుగానే భావించాలి. శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కిందిగా నొప్పి వస్తుంటే హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి. ఒక్కోసారి దవడల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించవచ్చు. కాళ్లు, పాదాలు, మడిమలు అన్నీ ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచనలుగా భావించాలి. హార్ట్ బీట్‌ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి.

ప్యానిక్ అటాక్
ప్యానిక్ అటాక్ అంటే చాలా మందికి తెలియదు. ఏదైనా బ్యాడ్ న్యూస్ చెడ్డ వార్తను వినడం వల్ల కొందరు తీవ్ర భయానికి లోనవుతారు. మీరు మరి కొద్దిసేపట్లో చనిపోతున్నారనే వార్తను చెప్పడంగానీ, మరణం అంచుల దాకా వెళ్లినా ఉద్వేగం, భయం, ఆందోళనకు గురవుతారు. దీన్నే ప్యానిక్ అటాక్ అంటారు.

గుండె పోటులాగానే
ప్యానిక్ అటాక్ లక్షణాలు గుండెపోటు లక్షణాలను పోలి ఉంటాయి. కొందరిలో అకస్మాత్తుగా యాంగ్జైటీ కలిగి ప్యానిక్ అటాక్ రావచ్చు. మరికొందరు తీవ్రమైన ఒత్తిడికి గురవడం వల్ల ప్యానిక్ అటాక్ వస్తుంది. కొందరు మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లమత్తుపదార్థాలను వాడడం వల్ల ప్యానిక్ అటాక్ కు గురికావొచ్చు.

భయం వల్ల
ప్యానిక్ అటాక్ లో అగోరాఫోబియా కూడిన అటాక్ ఉంటుంది. దీనికి గురైన వారికి ఏ ప్రదేశం కూడా సురక్షితంగా తోచదు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి వెళ్లే వీలు లేకుండా పేషెంట్ చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మొత్తం ఖాళీగా ప్లేస్ గానీ లేదంటే ఎత్తై ప్రదేశాలకు వెళ్లినప్పుడుగానీ ఇలాంటి భయాలు ఎక్కువగా ఏర్పడుతాయి. దీంతో తెలియని పెయిన్ కు గురువుతారు.

ఛాతీనొప్పి
ప్యానిక్ అటాక్ వల్ల వ్యక్తి తీవ్రమైన ఛాతీనొప్పికి గురువుతాడు. గుండెనొప్పి మాదిరిగా వీరికి పెయిన్ వస్తుంది. అయితే అన్నీ పరీక్షలు చేశాక వారికి గుండెజబ్బులేవీ లేవని అది కేవలం ప్యానిక్ అటాక్ మాత్రమేనని తేలుతుంది. చాలామంది వారికి వచ్చింది ప్యానిక్ అటాక్ అని గుర్తించడం కష్టమవుతుంటుంది.

ఎలాంటి హాని జరుగుతుంది
ప్యానిక్ అటాక్స్ అంత సీరియస్ సమస్య కాదు. ఆలోచనలు మార్చుకుంటే దీని నుంచి బయటపడొచ్చు. అయితే ఒక్కోసారి శరీరంలోని కొన్ని కీలక అవయవాలపై ప్యానిక్ ఎటాక్ ప్రభావం ఉంటుంది. అందువల్ల ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

లక్షణాలివే
ప్యానిక్ అటాక్ అకస్మాత్తుగా వస్తుంది. చాలా వేగంగా గుండె కొట్టుకుంటుంది. ఛాతీ తీవ్రంగా పైకి కిందికీ కదులుతుంది. ఊపిరి అందకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయాసం ఎక్కువ అవుతుంది. మత్తుగా ఉంటుంది. నిద్రవస్తున్నట్లుగా అనిపిస్తుంది. గుండెదడ తో పాటు కడుపు ఉబ్బరం, వికారం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చినట్లుగా అనిపించడం, శరీరం, కాళ్లూ చేతులు వణకడం జరుగుతుంది.

కారణాలివే
ప్యానిక్ అటాక్ ప్రత్యేకంగా కారణాలు లేవు. కొన్ని మెడికల్ కండీషన్స్ వల్ల ప్యానిక్ అటాక్ కు మీరు గురి కావొచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ తో బాధపడే వారు కొన్ని రకాల మందులను ఉపయోగిస్తుంటారు. దీంతో వారు ప్యానిక్ ఎటాక్ కు గురికావొచ్చు. అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు కూడా ప్యానిక్ అటాక్ కు గురికావొచ్చు. ఆహారానికి తీపినిచ్చేందుకు వాడే నాన్ శాకరైడ్ స్వీటెనర్ అయిన ఆస్పర్టమ్ వల్ల ప్యానిక్ అటాక్ కు గురయ్యే అవకాశం ఉంది.

నిద్రలోనూ
కొందరు నిద్రలోనూ ప్యానిక్ అటాక్ కు గురువుతుంటారు. నిద్రలో ప్యానిక్ అటాక్ వస్తే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అకస్మాత్తుగా నిద్రనుంచి ఉలిక్కిపడి మేల్కొంటారు. కేవలం తెలియని భయమే వాళ్లను నిద్రనుంచి లేచేలా చేస్తుంది. అయితే ఈ ప్యానిక్ అటాక్ వ్యవధి ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు.

దూరంకావాలంటే
ప్యానిక్ అటాక్స్ కు దూరంకావాలంటే మీపై మీకు విశ్వాసం పెరగాలి. త్యం వ్యాయామం చేయాలి. కృత్రిమ రంగులు, అడెటివ్స్ కలిపినవి ఆహారాలు తీసుకోకూడదు. మద్యపానం, కెఫిన్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

చికిత్స
ప్యానిక్ అటాక్స్‌కు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. బెంజోడయజపైన్స్ ఉండే మందులు కాస్త మేలు చేస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. కౌన్సెలింగ్ అవసరం. యోగా కూడా చేయాలి.



Click it and Unblock the Notifications