శరీరంపై ఉన్న బొబ్బల చికిత్సకు ఉల్లిపాయలను ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోండి

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

అవాంఛితంగా చర్మంపై సహజంగా సంభవించే కొన్ని కురుపులను "బొబ్బలు" అంటారు. ఇది ఒక ముద్ద వలె ఉంటుంది మరియు తరచూ చర్మంను విసిగిస్తుంది, తద్వారా అది గట్టిగా తయారయ్యి ఒక ముద్దలా కనిపిస్తుంది.

బొబ్బలు అనేవి చెమట రంధ్రాలలో సాధారణంగా కనిపిస్తాయి. ధూళి లేదా కాలుష్యం ఈ చెమట రంధ్రాలను అడ్డుకుంటుంది, తద్వారా గడ్డలూ ఏర్పడతాయి. అయితే కొన్నిసార్లు అధిక వేడి కూడా అందుకు కారణం కావచ్చు.

కారణం తెలియకపోయినా, ప్రజలు వారి జీవితంలో, ఏదో ఒక సమయంలో, ఈ అవాంఛిత చర్మ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, మరుసటి రోజు మీరు ఒక పాటల కచేరీని కలిగి ఉన్నారని భావిస్తే, ఒక పెద్ద బొబ్బ (లేదా) చిన్న గడ్డలూ ఒక సమూహముగా మీకు కనిపిస్తాయి !

Ways To Use Onions To Treat Boils

ఇంకా బాగా చెప్పాలంటే, నిజానికి అది ఒక పీడకల, ఇంకొక చెత్త విషయం ఏమిటంటే : అలా వచ్చిన బొబ్బల కోసం మీరు ఏ మందులూ వాడలేరు. కానీ, మీరు ఆ బొబ్బల చికిత్సల కోసం పాత మూలికలు కలిగిన ఔషధాలను ప్రయత్నించవచ్చు.

ఏదైనా ఔషధాలను తీసుకునే ముందు, ఆ చర్మ ప్రాంతాన్ని శుభ్రపరుస్తూ మరియు ఒక శుభ్రమైన వస్త్రంతో తుడిచిపెట్టి, తర్వాత మందులను అప్లై చేయాలి.

హల్ది మరియు చందనముతో తయారుచేసిన ఫేస్ ప్యాక్లను వాడటానికి కొందరు ఆసక్తిని కలిగి ఉంటారు; కానీ మీ వంటగదిలో మిమ్మల్ని కేకలు వేసేలా చేసే "ఉల్లిపాయ" ఒకటుందని మీకు తెలుసా !

అలా వాటితో మీరు ఆ చెడ్డ కురుపులను నయం చేయగలరా?

మన జీవితాలను కాపాడే ఒక సాధారణమైన ఉల్లిపాయ ఈ బొబ్బలను ఎలా నివారించగలదో తెలుసుకోవడానికి మరిన్ని చిట్కాలను ఈ క్రింద చూడండి.

ఉల్లిపాయతో పిండికట్టు :

ఉల్లిపాయతో పిండికట్టు :

చిన్న ముక్కలుగా ఉల్లిపాయను బాగా కట్ చేసి, మరియు మీ చర్మం పై వచ్చిన బొబ్బల మీద దరఖాస్తు (అప్లై) చెయ్యడానికి ఒక పిండికట్టులా తయారు చేసుకోవాలి. ఆ బ్యాండ్ తో బొబ్బలు వచ్చిన ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేసి, ఆ రాత్రంతా దానిని ఆ విధంగానే వదిలిపెట్టి, మరుసటి రోజు ఉదయం, ఆ కట్టును తొలగించి, ఆ ప్రాంతాన్ని చల్లటి నీళ్లతో కడగడం. మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ పద్ధతిని కొనసాగించండి.

ఉల్లిపాయ నీరు ఉపయోగించండి:

ఉల్లిపాయ నీరు ఉపయోగించండి:

మొదటిగా, ఉల్లిపాయని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక పాన్ లో ఆ మిశ్రమాన్ని తీసుకొని, ఒక కప్పు నీటిని జోడించండి. తరువాత, ఆ నీరు బాగా మరిగే వరకు అలానే స్టౌ మీద వాటిని ఉంచండి. పాన్ ను పక్కన పెట్టి, ఆ నీటిని చల్లబరచిన తర్వాత, ఆ బొబ్బల పై శుభ్రమైన కాటన్ వస్త్రంతో తుడిస్తూ ఉండండి.

ఉల్లిపాయలతో వెల్లుల్లిని ఉపయోగించండి:

ఉల్లిపాయలతో వెల్లుల్లిని ఉపయోగించండి:

వంటగది యొక్క రెండు ముఖ్యమైన పదార్థాలతో ఏర్పడిన ఒక మిశ్రమము, బొబ్బల వల్ల తీవ్రంగా ఎదుర్కొంటున్న బాధ నుండి మిమ్మల్ని రక్షించగలవు. చక్కగా ఒక ఉల్లిపాయను చాలా చిన్నముక్కలుగా చేసి దానికి వెల్లుల్లిని మరియు నాలుగు లవంగాలు జోడించండి. వాటన్నింటినీ కలిపి ఒక పేస్ట్ లా తయారు చేసి, వాటిని నుండి పిండి వెయ్యబడిన రసాన్ని బయటకు తీసి ఒక మిశ్రమముగా ఉంచండి. మీ బొబ్బలలో అలా తయారుచేయబడిన మిశ్రమాన్ని అప్లై చేసాక ఒక 10 నిముషాలు అలా ఉంచి ఆ తర్వాత, దానిని కడగాలి. మంచి ఫలితాల కోసం రోజులో కనీసం నాలుగు సార్లు ఈ పద్ధతిని కొనసాగించండి.

ఉల్లిపాయ పేస్ట్ ను ఉపయోగించండి:

ఉల్లిపాయ పేస్ట్ ను ఉపయోగించండి:

ఉల్లిపాయ తురుముకు కలుపుతూ, కొంత మొత్తాన్ని నీటితో కలుపుతూ ఉల్లిపాయ పూర్తిగా కరిగిపోయేలా ఒక బ్లెండర్లా చేయ్యండి. ఈ పేస్ట్ ను బొబ్బలు గురయ్యిన ప్రాంతాలలో క్రమం తప్పకుండా వాడుతూ ఉండటం వలన ఆ చర్మ భాగాన్ని శుభ్రపరుస్తుంది.

ఉల్లిపాయలతో పంది మంసాన్ని (బేకాన్) ఉపయోగించండి:

ఉల్లిపాయలతో పంది మంసాన్ని (బేకాన్) ఉపయోగించండి:

ఈ రకమైన కలయిక వినడానికి విచిత్రంగా ఉన్నా కానీ, ఇది నిజానికి బొబ్బలను వదిలించుకోవటం సహాయం చేయవచ్చు. బేకన్ ముక్కతో పాటు ఉల్లిపాయ ముక్కను వేడి చేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బొబ్బల మీద కట్టుతో కప్పి ఉంచినట్లుగా కట్టి ఉంచండి. దాన్ని శుభ్రం చేయ్యకుండా కొన్ని గంటల పాటు అలానే వదిలివేయండి. ఇలా ప్రతిరోజూ ఈ పద్ధతిని కొనసాగించండి.

ఉల్లిపాయతో తేనెను ఉపయోగించండి:

ఉల్లిపాయతో తేనెను ఉపయోగించండి:

ముడితేనెను నాలుగు స్పూన్లు మరియు ఉల్లిపాయ రసమును రెండు స్పూన్లు తీసుకోవడం ద్వారా తేనె మరియు ఉల్లిపాయను కలిపి ఒక పేస్ట్లా చేయ్యండి. బొబ్బలు మీద అప్లై చేయడానికి ముందు బాగా కలపాలి. దానిని శుభ్రం చేయడానికి ముందు కొన్ని నిమిషాలు అలానే వదిలివేయండి. ప్రతిరోజూ ఈ పద్ధతినే రిపీట్ చేయండి.

English summary

Ways To Use Onions To Treat Boils

There are certain ways to use onions to treat boils. Know about a few of the ways, here on Boldsky.
Story first published: Thursday, November 9, 2017, 20:00 [IST]