Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.!
నాన్‌వెజ్ ప్రియులు వారానికి ఒక్కసారో లేదా నెలకు మూడు సార్లు మటన్ తినకుండా ఉండలేరు. మటన్ తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా అందుతాయి. అలా అని మటన్‌కి సంబంధించి అన్నీ తింటే హెల్త్ రివర్స్ కొట్టినట్లే. ముఖ్యంగా గొర్రె లేదా మేక మాంసంలోని ఈ భాగాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటి శరీరంలోని కొన్ని భాగాల్లో బ్యాక్టీరియా, టాక్సిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ సైతం ఉంటుంది. ఈ మేరకు హెల్త్ దృష్ట్యా కొన్ని భాగాలను తినకూడదు. అవేంటంటే..

గొంతు భాగంలోని గ్రంథులు
మేక లేదా గొర్రె గొంతు భాగంలో లింఫ్ గ్రంథులు ఉంటాయి. ఇవి రక్షణ కవచాలు అంటే వాటి శరీరంలోకి వచ్చే క్రిములు, బ్యాక్టీరియాను ఫిల్టర్ చేస్తాయి. వీటిని తీసుకుంటే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో అనారోగ్యానికి దారితీస్తుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.
ఊపిరితిత్తులు
మనుషుల్లాగే మేక, గొర్రె ఊపిరితిత్తులు కూడా కాలుష్య కణాలు, మైక్రోబ్స్‌ను ఫిల్టర్ చేస్తాయి. ఈ క్రమంలో మేక లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్లు ఇన్‌ఫెక్షన్ కారకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే శ్వాసకోశ సంబంధిత సమస్యలు రావచ్చు.

పేగులు
మటన్‌తో పాటు పేగులు, పొట్ట భాగాన్ని బోటిగా పిలుస్తారు. అయితే మేక చిన్న, పెద్ద పేగుల్లో జంతువుల మలమూత్ర వ్యర్థాలు, సరిగా అరగని ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ భాగాలను తినేటప్పుడు చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ప్రమాదకర క్రిములు పొట్టలోకి చేరి ఫుడ్ పాయిజనింగ్‌కి దారితీస్తుంది. విరేచనాలు, వాంతులు ఏర్పడే ప్రమాదం ఉంది.
మెదడు, వెన్నెముక, పచ్చి రక్తం భాగాలు
మేక మెదడులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ జంతువులకి మెదడు వ్యాధి ఉన్నట్లయితే వాటిని తిన్నట్లయితే అది మనుషులకు సోకవచ్చు. జంతువులకు ఉండే కొన్ని రకాల వ్యాధులు వాటి వెన్నెముక భాగాలకు సోకవచ్చు. అందుకే ఈ భాగాన్ని తినకుండా ఉండటం మంచిది. పచ్చి రక్తాన్ని తాజాగా ఉన్నప్పుడే బాగా వండుకుని తినాలి. లేదంటే హెల్త్ రిస్క్‌లు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఇంటర్నల్ ఆర్గాన్ ఫ్యాట్
మేక పొట్ట భాగం చుట్టూ ఉండే కొవ్వును చాలా మంది కూరల్లో కలిపి వండుతారు. అయితే ఇందులో శరీరానికి హాని చేసే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకున్నట్లయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. రక్త నాళాల్లో పేరుకుపోవచ్చు. దీంతో రక్త సరఫరాకి అడ్డంకులు ఏర్పడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మటన్ కొనుగోలు చేసేటప్పుడు తాజాగా, ఆరోగ్యంగా ఉన్న దానిని ఎంచుకోవాలి. నమ్మకమైన దుకాణంలో మాత్రమే మటన్ కొనుగోలు చేయాలి. దుర్వాసన రాని మటన్ ఎంచుకోవాలి. లేదంటే వివిధ ఆరోగ్య సమస్యలకి దారితీసే ప్రమాదం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
