Latest Updates
-
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.!
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా?
క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ (చక్కెర) అంటే చాలా ఇష్టం. దాన్ని ఆహారంగా తీసుకునే అవి బతుకుతాయి. కాబట్టి మనం తినడం మానేసి ఉపవాసం ఉంటే, ఆ కణాలు పస్తులు ఉండి చనిపోతాయి కదా.. వినడానికి ఈ ఐడియా ఎంతో ఆసక్తికరంగా, చాలా సింపుల్ లాజిక్ లా అనిపిస్తుంది. స
సోషల్ మీడియాలో ఇలాంటి సలహాలు మనకు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. కానీ వాస్తవానికి మన శరీరం పనిచేసే విధానం వేరు. కఠినమైన ఉపవాసాలు ఉంటే క్యాన్సర్ తగ్గుతుందా? వైద్య శాస్త్రం ఏమంటోంది? అనే విషయాలను ఇక్కడ చూడండి.

మనం ఆహారం తీసుకోవడం మానేసినంత మాత్రాన క్యాన్సర్ కణాలు ఆకలితో అలమటించవని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం ఆహారం తీసుకోనప్పుడు, మన మెదడుకు, ఇతర ముఖ్యమైన అవయవాలకు నిరంతరం శక్తిని అందించడం కోసం మన లివర్ రంగంలోకి దిగుతుంది. అది మన శరీరంలో నిల్వ ఉన్న శక్తిని, ముఖ్యంగా కండరాలలోని అమైనో ఆమ్లాలను ఉపయోగించి స్వయంగా గ్లూకోజ్ ను తయారు చేయడం ప్రారంభిస్తుంది.
ఈ అద్భుతమైన ప్రక్రియనే వైద్య పరిభాషలో గ్లూకోనియోజెనిసిస్ (Gluconeogenesis) అని అంటారు. తివర్ ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ గ్లూకోజ్ ను క్యాన్సర్ కణాలు కూడా చాలా సులభంగా గ్రహిస్తాయి. అంటే మనం రోజుల తరబడి పస్తులున్నా సరే క్యాన్సర్ కణాలకు కావాల్సిన ఆహారాన్ని మన శరీరమే స్వయంగా ఉత్పత్తి చేసి పెడుతుందన్నమాట.

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారిలో చాలా మంది ఇప్పటికే తీవ్రమైన కండరాల క్షీణత (దీనిని కాచెక్సియా అంటారు) బారిన పడే ప్రమాదంలో ఉంటారు. ఇలాంటి సమయంలో సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా సుదీర్ఘమైన ఉపవాసాలు చేయడం వల్ల రోగిలోని కండరాలు మరింతగా కరిగిపోతాయి. దీనివల్ల వాళ్లు రోజురోజుకూ తీవ్రమైన నీరసానికి గురవుతారు. ఫలితంగా కీమోథెరపీ, రేడియేషన్ లేదా సర్జరీ లాంటి కఠినమైన, ఎంతో అవసరమైన క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ని తట్టుకునే శారీరక బలాన్ని రోగులు పూర్తిగా కోల్పోతారు.
కొన్ని ప్రత్యేకమైన క్యాన్సర్ పరిస్థితులలో ఉపవాసం ఏమేరకు పనిచేస్తుందనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇది క్యాన్సర్ ను పూర్తిగా నయం చేస్తుందనడానికి గానీ, ప్రామాణిక మెడికల్ ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయం అని చెప్పడానికి గానీ ఎలాంటి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పటికే ఎన్నో సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ. ఆధారాలు లేని తప్పుడు సలహాలను పాటించి, మీ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications