Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
చికెన్ తినేవారికి షాకింగ్ న్యూస్.. ఆ పార్ట్స్ తింటే చనిపోతారట!
ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. ఈ చికెన్ తక్కువ ధరకు లభించడంతో పాటు, ఆరోగ్యకరమైన ఫలితాలు ఇస్తుండడంతో పాటు రుచికరంగా ఉండడంతో చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడతారు. కానీ చికెన్‌లోని కొన్ని భాగాలను తినడం వలన అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అసలు చికెన్‌లో ఎలాంటి భాగాలు తినకూడదు, తింటే ఏమవుతుంది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్‌లో తినకూడని భాగాలు
కోడి మెడ
చాలామందికి కోడి మెడభాగాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. కోడిలో ఎన్ని మంచి భాగాలు ఉన్నా కోడి మెడ భాగాన్ని కావాలని వేసుకొని మరీ తింటారు. కానీ ఈ భాగాన్ని తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మెడ భాగంలో కోడి శోషరస వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా కోడి తన శరీరంలోని వ్యర్థాలను, బ్యాక్టీరియాలను బయటికి పంపుతుంది. ఆ భాగాన్ని తింటే అందులో ఉండిపోయిన బ్యాక్టీరియాలను మన శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. అందుకే కోడి మెడభాగాన్ని తినకూడదని చెబుతుంటారు.

కోడి తోక
కోడి తోకను చాలా మంది పట్టించుకోకుండా తినేస్తారు. కానీ ఈ భాగంలో చాలా బ్యాక్టీరియాలు, హానికరమైన క్రీములు ఉండిపోతాయి. వాటిని ఎంత ఉడికించిన కూడా అవి నశించవు. ఈ క్రీములు శరీరంలోకి చేరి మనకు తీవ్రమైన హాని చేకూర్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ భాగాన్ని కూడా వదిలేయడం మేలు
కోడి మొప్పలు
కోడి మొప్పలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెబుతుంటారు. ఈ మొప్పల్లో ఆహరం జీర్ణమయ్యే భాగాలు చాలా ఉంటాయి. ఈ భాగంలో కూడా చాలా ప్రమాదకరమైన క్రీములు, బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా హాని చేకూర్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని తినడం చాలా ప్రమాదకరం.
కోడి ఊపిరితిత్తులు
సాధారణంగా చాలా మంది కోడి ఊపిరితిత్తులు పడేస్తుంటారు. కానీ కొందరు మాత్రం వాటిని వదలకుండా తినేస్తారు. ఈ కోడి ఊపిరితిత్తుల్లో అత్యంత హానికారకమైన క్రీములు, బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి తినడం వలన శరీరానికి చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని తినడం మానేయండి. ఈసారి చికెన్ తినేటప్పుడు ఈ భాగాలను వదిలేసి తినడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
