Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చేపలు తిన్న తర్వాత పాలు తాగితే చర్మ వ్యాధులు వస్తాయా?
చేపలను చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు. రకరకాల చేపలు ఫ్రై, చేపల పులుసు, ఫిష్ బిర్యానీ ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటారు. వారందరికీ ఎప్పుడో ఒకప్పుడు పెద్ద వాళ్ల నుంచి ఒక సూచన లేదా హెచ్చరిక వచ్చే ఉంటుంది. అదేంటంటే.. ఫిష్ తిన్న తర్వాత పాలు తాగవద్దని, పెరుగు తినవద్దని చెప్పడం చాలా మందికి తెలిసిందే.
చేపల కూర తిన్న తర్వాత పాలు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. బొల్లి వస్తుందని హెచ్చరిస్తుంటారు. నిజంగానే చేపలు తిన్న తర్వాత పాలు తాగితే ఆరోగ్య సమస్యలు, బొల్లి వస్తాయా.. లేదా.. అందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండూ హైప్రోటీన్ ఫుడ్స్ అందుకే ఆ సమస్య:
చేపలు తిన్న తర్వాత పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు ఏవీ తీసుకోవద్దని అంటారు పెద్దలు. అలా తింటే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని అంటారు. చర్మం అంతటా తెల్ల మచ్చలు ఏర్పడతాయని, బొల్లి వస్తుందని అందుకే చేపలు తిన్న తర్వాత పాలు తాగొద్దని అంటారు. కాగా, చేపలు, పాలు రెండూ హై ప్రోటీన్ ఫుడ్స్.
అధిక పోషకాలు ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి సాధారణంగానే ఎక్కువ సమయం పడుతుంది. అలాగే వీటిని జీర్ణించుకోవడానికి శరీరం శక్తిని వెచ్చించాల్సి వస్తుంది. దాంతో పాటు వివిధ రకాల ఎంజైమ్‌లు అవసరం కూడా. ఈ రెండు రకాల హై ప్రోటీన్ ఫుడ్స్ ను ఒకేసారి తీసుకుంటే వాటిని జీర్ణించే ప్రక్రియలో గ్యాస్ ఎక్కువ మొత్తంలో విడుదల అవుతుంది. దాని వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మరికొంత మందిలో జీర్ణ సమస్యలు కూడా రావొచ్చు.
రెండింటిని కలిపి తీసుకుంటే సమస్యేం లేదు:
చేపలు తిన్న తర్వాత పాల తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎక్కడా నిరూపితం కాలేదని, దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపలు తిన్న తర్వాత పాలు తాగితే చర్మ సంబంధిత సమస్యలు, బొల్లి వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని పేర్కొంటున్నారు. చేపలు, పాలు, పెరుగు కలిస్తే విషంగా మారుతుందన్న దాంట్లోనూ ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు వైద్యులు. చాలా ప్రాంతాల్లో చేపలను నిత్యం తింటుంటారు. ఆ తర్వాత పాలు, పెరుగు లాంటివి కూడా తీసుకుంటారు.
చేపలు, పాలు కలిపి తినడం వల్ల బొల్లి రాదు:
బొల్లి అనేది ఒకరకమైన చర్మ వ్యాధి. చర్మంపై పాచెస్ మాదిరిగా రంగు మారుతుంది. చర్మం వ్యాప్తంగా తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇది కాలక్రమేణా పెద్దదిగా మారుతుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా బొల్లి ఏర్పడవచ్చు. ఎక్కడ ఏర్పడినప్పటికీ క్రమంగా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. మెలనిన్ సాధారణంగా జుట్టు, చర్మం రంగును నిర్ణయించే పదార్థం. బొల్లి వచ్చిన వారిలో మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోతాయి లేదా పని చేయడం మానేస్తాయి. బొల్లి అన్ని చర్మ రకాల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.
బొల్లి ప్రాణాపాయమైన వ్యాధి కాదు. అలాగే బొల్లి అంటువ్యాధి కూడా కాదు. అయితే బొల్లి వచ్చిన వారిలో ఒకరకమైన ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. దీని వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications