Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
షుగర్,బీపీ కంట్రోల్ లో ఉంచాలంటే..పరగడుపునే వీటిని తినాలంట!
మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో షుగర్ లేదా డయాబెటిస్ వ్యాధితో బాధపడేవాళ్లు ఉన్నారు. వాస్తవానికి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఉంది కానీ పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇప్పటిదాకా రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 83 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అదే సమయంలో సుమారు 22 మిలియన్ల మంది అధిక రక్తపోటు(Blood Pressure) సమస్యతో జీవిస్తున్నారు.
ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ గా ఉంచడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఎవరైనా వ్యక్తి రక్తంలో చక్కెర,రక్తపోటును నియంత్రించడంలో ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఫైబర్, కొవ్వు తీసిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య ఆహారం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, ఇన్సులిన్ నిరోధకతను నిరోధిస్తుంది. అంతేకాకుండా ఉప్పు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు, పానీయాలను ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణులు తెలిపిన ప్రకారం డయాబెటిస్, రక్తపోటు అదుపులో ఉండటానికి ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తినాలో ఇక్కడ చూడండి.
మెంతుల నీరు
మెంతులు శరీర వేడిని తగ్గించడానికి సహాయపడే అద్భుతమైన పదార్థం. మెంతుల విత్తనాలు మధుమేహాన్ని నియంత్రించడానికి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. అంతేకాకుండా ఈ మెంతుల విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర గ్రహించబడటాన్ని నెమ్మదిస్తుంది. మెంతుల విత్తనాలను రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి.
టొమాటో, దానిమ్మ రసం
టొమాటో, దానిమ్మ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా టొమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది కొవ్వు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అదే సమయంలో దానిమ్మ శరీరంలో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇలాంటి టొమాటో రసంతో దానిమ్మ రసం కలిపి ఉదయం పరగడుపున తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్, రక్తపోటు అదుపులో ఉంటాయి.
అవిసె గింజలు
అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి. అవిసె గింజలను ఉదయం తీసుకోవడం చాలా మంచిది. ఈ గింజలు బ్లడ్ లో షుగర్ లెవల్, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. అవిసె గింజల్లోని అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదింపజేయడం ద్వారా రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇలాంటి అవిసె గింజలను మెత్తగా పొడి చేసి నీటిలో కలిపి ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున తాగితే..షుగర్, బీపీ అదుపులో ఉంటాయి.
పసుపు కలిపిన నిమ్మరసం
పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న అద్భుతమైన సుగంధ ద్రవ్యం. పసుపు రక్తంలో చక్కెర,రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. దీనికి కారణం పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం. పసుపు పొడిని నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కాలేయం కూడా శుభ్రపడుతుంది.
మిరియాలు కలిపిన దాల్చిన చెక్క నీరు
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉత్తమమైనదని అందరికీ తెలిసిందే. దాల్చిన చెక్కతో మిరియాల పొడిని కలిపి తీసుకున్నప్పుడు అందులోని పెప్పరిన్ పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు దాల్చిన చెక్క నీటిలో చిటికెడు మిరియాల పొడి వేసి ఉదయం పరగడుపున తాగాలి. దీని వల్ల షుగర్ మాత్రమే కాకుండా అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications