Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వర్షాకాలంలో పెరుగు తింటున్నారా? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెరుగులోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది భోజనం చివర్లో తప్పకుండా పెరుగుతో కొంత మొత్తంలోనైనా అన్నం తింటారు. వెజ్, నాన్-వెజ్ ఏది తిన్నా.. కాస్తంత పెరుగుతింటేనే చాలా మందికి సంతృప్తిగా ఉంటుంది. అయితే ఎండాకాలంలో పెరుగు, పెరుగుతో చేసిన మజ్జిగ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే.

అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో పెరుగు వాడకం సాధారణంగా తగ్గుతుంది. ఇంట్లో పెద్దలు కూడా వర్షాకాలంలో పెరుగు తినకూడదని అంటుంటారు. ఆయుర్వేదం ప్రకారం కూడా వానాకాలంలో పెరుగు తినడం వల్ల వాతా, పిత్త, కఫా దోషాలని ఒకేసారి ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు వంటి చల్లని శక్తి కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. వర్షాకాలంలో చల్లని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఒంట్లో శ్లేష్మం ఏర్పడుతుంది. అలాగే పేగు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. దాంతో పాటు పలు రకాల అలెర్జీలు కూడా కొంత మందిలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.
శ్వాసకోశ సమస్యలు
వానాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం ఎక్కువవుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొందరిలో పెరుగు తినడం వల్ల అలెర్జీలు కూడా రావొచ్చు.
జీర్ణ సమస్యలు
ఆయుర్వేదం ప్రకారం పెరుగుకు చల్లటి శక్తి ఉంటుంది. దీని వల్ల జీర్ణాశయంలోని మంట తగ్గుతుంది. దీని వల్ల అన్నం అరుగుదల సరిగ్గా లేక అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పెరుగులో రెండు, మూడు ఎండుమిర్చిలు, కాస్తంత వేయించిన జీలకర్ర, తేనెకలపడం వల్ల ఈ జీర్ణ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
మరి పెరుగు ఎప్పుడు తింటే మంచిది?
పెరుగు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ప్రోబయోటిక్స్ పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగులోని ఈస్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మిగతా రోజుల్లో పెరుగు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని వల్ల రోగాలు దాడి చేసినా మన ఇమ్యూనిటీ సమర్థవంతంగా పోరాడగలుగుతుంది. అలాంటి పెరుగును భోజనం చివరలో తినకపోతే చాలా మందికి సంతృప్తిగా అనిపించదు. కొన్ని ముద్దలైనా పెరుగు అన్నం తిననిదే చాలా మంది భోజనాన్ని పూర్తి చేయరు.
అలాంటి వారు వర్షాకాలంలో పెరుగు తీసుకోవాలనుకుంటే.. పెరుగులో కొన్ని వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు లాంటివి జోడించుకోవాలి. అలాగే కొద్దిగా తేనె కలిపిన పెరుగు తిన్నా పెరుగులోని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అయితే పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే మైగ్రేన్ వంటి తలనొప్పి సమస్యలు ఎదురవుతాయి. బయోజెనిక్ అమైన్ వల్ల ఇలా జరుగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications