Latest Updates
-
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి
ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ వాడాలనుకుంటున్నారా? ఇది తెలుసుకున్నాకే కొనండి
ఉదయం పళ్లు తోమడం నుంచే రోజు ప్రారంభమవుతుంది. ఇది చాలా మందికి ఉన్న అలవాటే. కొందరు బ్రష్‌లు, వేప పుల్లలు, చేతులతో పళ్లను, నాలుకను శుభ్రం చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు కూడా వచ్చాయి. వీటిని అలా పళ్లపై పెట్టుకుని స్విచ్ నొక్కితే చాలు అవే పళ్లను శుభ్రం చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లు వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీరు కూడా ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ కొనాలనుకుంటుంటే.. వాటి ద్వారా కలిగే లాభాలేంటో, నష్టాలేంటో ముందుకు తెలుసుకోండి.
మాన్యువల్ టూత్‌బ్రష్ ప్రయోజనాలు:
మాన్యువల్ టూత్‌బ్రష్‌ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి టూత్‌బ్రష్‌లు వాడటం చాలా మందికి అలవాటు. ఈ మాన్యువల్ టూత్‌బ్రష్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
* ధర.. మాన్యువల్ టూత్‌బ్రష్‌లు ఎక్కడైనా లభిస్తాయి. చిన్న చిన్న కిరాణ షాపుల నుంచి మాల్స్ వరకు ఎక్కడైనా చాలా చౌకగా అందుబాటులో ఉంటాయి.
* రంగు, పరిమాణం, ముళ్ల సున్నితత్వం ఇలా చాలా రకాలు అందుబాటులో ఉంటాయి.
* ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.
* బ్యాటరీలపై, పవర్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
* సులభంగా మార్చేసి వేరేది వాడుకోవచ్చు.

మాన్యువల్ టూత్‌బ్రష్‌లు ప్రతికూలతలు:
* వీటికి టైమర్లు అంటూ ఏమీ ఉండవు
* పళ్లను సరైన పద్ధతిలో తోముకునేందుకు సహాయం ఉండదు
* పిల్లలు, వికలాంగులు ఉపయోగించడం కాస్తంత కష్టం
* కఠినంగా బ్రష్ చేస్తే చిగుళ్లు సమస్యలు రావొచ్చు
ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ ప్రయోజనాలు:
* పిల్లలకు, వికలాంగులకు ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
* పళ్లపై పేరుకుపోయిన ప్లాక్ ను తొలగించడం చాలా సులభం
* బ్రేసెస్ ఉన్నప్పటికీ పళ్లను శుభ్రం చేయడం సులభం
* పళ్లు తోముకోవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది.
ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ ప్రతికూలతలు:
* ధర చాలా ఎక్కువ
* టూత్‌బ్రష్ హెడ్స్ తరచూ మార్చాల్సి ఉంటుంది
* ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు పాడయ్యే అవకాశాలు ఉంటాయి
* ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు కింద పడితే పాడవుతాయి
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
