Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
వారానికి ఒక్కరోజు మీ భోజనంలో ఈ ఒక్కటి ఉంటే చాలు.. గుండెకి, మెదడుకి నో టెన్షన్.!
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ శ్రద్ధ చాలా పెరిగింది. రోజువారీ ఆహారంలో పోషకాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటున్నారు. బిజీ లైఫ్‌లోనూ ఆరోగ్యంపై దృష్టి సారించడం చాలా అవసరమనేది తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు ముందుటాయి. గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు ఇది చాలా కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మన శరీరం అవసరమైన ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లను తనంతట తాను తగినంత పరిమాణంలో ఉత్పత్తి చేసుకోలేవని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. అందుకే వాటి అవసరాలను ఆహారం ద్వారా తీర్చుకోవాలని.. ఇవి తగినంత పరిమాణంలో శరీరానికి అందితే పోషణ మెరుగై జీవక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
మీరు తీసుకునే రోజువారీ డైట్‌లో పోషకాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిలో ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. అయితే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం ద్వారానే మాత్రమే కాకుండా.. జీవనశైలి కూడా హెల్తీగా ఉండాలని అంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా శరీరంలోని కొన్ని భాగాల పనితీరుకు ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు దోహదపడతాయి.
గుండె, మెదడు ఆరోగ్యం
గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒమేగా- 3 కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గించడంలో దోహదపడతాయి. అంతేకాకుండా మెదడు అభివృద్ధికి, పనితీరుకు ఒమేగా- 3 ఉపయోగపడతాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శరీరంలో వాపును నియంత్రిస్తాయి. కీళ్ల సమస్య ఉన్నవారు ఒమేగా- 3 లభించే ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

గర్భిణీలకు తప్పనిసరి
గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు భోజనంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది గర్భంలో శిశువు అభివృద్ధికి దోహదపడుతుంది. ఆహారంలో తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ఒమేగా- 3 లోపిస్తే లక్షణాలు
శరీరానికి తప్పనిసరిగా తగినంత మోతాదులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వీటి లోపం కారణంగా అనేక ప్రతికూల లక్షణాలు కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒమేగా- 3 లోపం కారణంగా కొందరిలో పొడి చర్మం, జుట్టు బలహీనపడటం, త్వరగా అలసట, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కీళ్లలో అసౌకర్యంగా అనిపించడం, కళ్లు పొడిబారడం వంటివి తలెత్తుతాయి. అయితే ఈ లక్షణాలు కేవలం ఒమేగా- 3 లోపం వల్లే కారణం కాదని గమనించాలి. ఈ సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆహార పదార్థాల్లో ఒమేగా- 3
ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు కొవ్వు చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, సోయాబీన్స్, కొన్ని ప్రత్యేకమైన కోడి గుడ్లలో పుష్కలంగా లభిస్తాయి. వీటిని తరచూ ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సమతుల్య ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ మీకు ఆహారంలో ఇవి లభించకపోతే.. వైద్యుడి సలహా మేరకు సప్లిమెంట్స్‌ను తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
