Dengue: ACలో ఉంటే డెంగ్యూ రాదని అనుకుంటున్నారా?, కానీ ఎలా వస్తుందో తెలుసా? డాక్టర్ కిశోర్ ఇంటర్వ్యూ

Can Dengue Spread From Person To Person మోతాదుకు మించిన ఆహారం తింటే అమృతం అయినా విషం అవుతుందని, శరీరానికి అవసరమైన ఆహారం మాత్రమే తినాలని, శరీరానికి అనువైన ఆహారం తినాలని, వ్యాధులతో బాధపడే వారు ఘనపదార్థాలు తీసుకోవడం వలన లేనిపోని సమస్యలు వస్తాయని, కాబట్టి ఎవరైనాసరై ఈకాలంలో మితభోజనం తినడం చాలా ఉత్తమం అని ప్రముఖ ఆయుర్వే వైద్యులు డాక్టర్ సీఏ. కిశోర్ తెలిపారు.

వేలాది సంవత్సరాల పురాతనమైన ఆయుర్వేద వైద్యం ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతుల్లో ఒక్కటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రపంచ దేశాల్లోని ఎంతో మంది ప్రముఖులు సైతం ఆయుర్వేద వైద్యాన్ని గౌరవిస్తారు. మొండి జబ్బులు, అనేక దీర్ఘకాలిక జబ్బులను నయం చేసే సత్తా ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే ఉందని ఇప్పటికే ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు నిరూపించారు.

Can Dengue Spread From Person To Person

ఐటీ రంగంలో దూసుకుపోతున్న ఈ కాలంలో అదే ఐటీ కంపెనీల నిపుణులు, ప్రముఖులు కూడా ఆయుర్వేద వైద్యం చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఆ వైద్యానికి ప్రధాన్యత ఇస్తున్నారు. ఆధునిక యుగంలో కూడా ఆయుర్వేద వైద్య విధానానికి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ ఏర్పడిందని ఇండియా ఆయుర్వేద ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీఏ కిశోర్ తెలిపారు. అలాంటి ఆయుర్వేద ప్రముఖ వైద్యుడు డాక్టర్ సీఏ. కిశోర్ తో ప్రత్యేక ఇంటర్వూ మీకోసం.

* ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా ?

ఐటీ కంపెనీలతో పాటు కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ కిశోర్ చెప్పారు. సమయం సరిపోలేదని ఎప్పుడంటే అప్పుడు ఎంతంటే అంత భోజనం తింటే అనారోగ్యం బారిన పడే అవకాశ ఉంటుందని డాక్టర్ కిశోర్ అన్నారు.

* అంబులెన్స్ ల కంటే స్పీడ్ గా వస్తున్నాయి

నేటి యువతి పిజ్జాలు, బర్గర్లు తినడానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారని డాక్టర్ కిశోర్ విచారం వ్యక్తం చేస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు తదితర ఆహార పదార్థాలు అందించే సంస్థలు అంబులెన్స్ కంటే స్పీడ్ గా వచ్చి మీరు కోరుకున్న ఆహారం మీకు డోర్ డెలవరీ ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారని, అలాంటి పిజ్జాలు, బర్గర్లు తింటే త్వరగా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని, వీలైనంత వరకు ఇలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే నేటి యువత ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ కిశోర్ సూచించారు.

Can Dengue Spread From Person To Person

* డెంగ్యూ లక్షణాలు వచ్చిన వెంటనే

డెంగ్యూ వ్యాధి ఈ కాలంలో పలు ప్రాంతాల్లో కామన్ అయిపోయిందని డాక్టర్ కిశోర్ అన్నారు. మురికివాడల్లోనే డెంగ్యూ ఎక్కువగా వస్తుందనే మాట అపద్దం అని అన్నారు. ఒక్కరి వలన ఈ వ్యాధి అరికట్టడం సాధ్యం కాదని, అలాగని ప్రభుత్వం మొత్తం బాద్యత తీసుకోవడం కూడా సాద్యం కాదని డాక్టర్ కిశోర్ అన్నారు. ప్రతిఒక్కరూ వారి ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకోవాలని, మనకు ఎందుకులే అని మన పరిసర ప్రాంతాలను పట్టించుకోవడం వదిలేస్తే డెంగ్యూ వ్యాధి తాండవం చేస్తుందని డాక్టర్ కిశోర్ అన్నారు.

* ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇలా వదిలేస్తే కథ క్లోజ్

డెంగ్యూ వ్యాధి వ్యాపించడానికి ముఖ్యంగా దోమలు నిల్వ ఉండటం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని డాక్టర్ కిశోర్ చెప్పారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, పనికిరాని టైర్లు, కొబ్బరి కాయ చిప్పలు ఇలా నీరు నిల్వ ఉండే వస్తువులు ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయని, ఆ దోమలు ఒకరిని కుట్టిన తరువాత చుట్టుపక్కల వారిని కుడుతాయని, అలా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని డాక్టర కిశోర్ అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో, ఇంటి ముందు నీరు నిల్వ ఉండకుండా, దోమలు గుడ్లు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరికి ఉంటుందని డాక్టర్ కిశోర్ అంటున్నారు.

* రూమ్ లో ఏసీ ఆన్ చేసుకుంటే సరిపోతుందా ?

ఐటీ కంపెనీలు, కార్పోరేట్ సంస్థల్లో డోర్లు, కిటికీలు అన్ని మూసేసి ఏసీ ఆన్ చేసుకుని మీటింగులు పెడుతారని డాక్టర్ కిశోర్ గుర్తు చేశారు. ఆ లాంటి మీటింగ్ కు వెళ్లిన వారిలో ఒకరికి కుట్టిన దోమ మరొకరికి కుట్టినా ప్రమాదమే అని డాక్టర్ కిశోర్ చెప్పారు. ఏసీ గదుల్లో దోమ కుడితే ఇమ్యూనిటీ పవర్ ఉన్న వ్యక్తులకు దోమ కుట్టిన చోట మెల్లగా గొక్కుని పట్టించుకోరని, అలాంటి వారికి డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువని, అయితే అదే మీటింగ్ లో ఉండే వారికి అదే దోమ కుట్టినా, ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా అలాంటి వారు వెంటనే అనారోగ్యానికి గురౌతారని డాక్టర్ కిశోర్ చెప్పారు. ఒకే మీటింగ్ హాల్ లో దోమ పలువురికి కుట్టినా ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్లకు ఏమీ కాదని, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అనారోగ్యానికి గురౌతారని డాక్టర్ కిశోర్ అన్నారు.

Can Dengue Spread From Person To Person

* తీసుకునే ఆహారం ముఖ్యం

మనిషికి ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం అని డాక్టర్ కిశోర్ చెప్పారు. ఇమ్యూనిటీ పవర్ ఉండే ఆహారం తీసుకోవడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడని, ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్లకు అంత త్వరగా డెంగ్యూ, వైరల్ ఫివర్ తదితర వ్యాధులు రావని అన్నారు. అదే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్లకు దోమలు కుట్టినా, చల్లటి నీళ్లు తాగినా లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ కిశోర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ఇప్పటికే బహిరంగ ప్రాంతాల్లో ఉండే నీరు తాగుతున్నారని, వాళ్లకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉందికాబట్టి వాళ్లు ఆరోగ్యంగా ఉంటున్నారని, సిటీల్లో బిస్లరీ బాటిల్ వాటర్ తాగుతున్న వాళ్లు ఎక్కువ శాతం అనారోగ్యం బారిన పడుతున్నారని, వారికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం అని డాక్టర్ కిశోర్ అన్నారు.

* పిల్లలకు పానీపూరీలు వద్దు

స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో చిన్నపిల్లలు నోటికి రుచిగా తినడానికి తల్లిదండ్రులకు కొన్ని ఆహార పదార్థాలు అడుగుతారని, ముఖ్యంగా రోడ్డు పక్కన పానీపూరీలు తినాలని పిల్లలు అడుగుతారని డాక్టర్ కిశోర్ గుర్తు చేశారు. రోడ్డు పక్కన శుభ్రంగా లేని పానీపూరీలు చికెన్ కబాబ్, బోండా, బజ్జీలు తదితర ఆహారపదార్థాలు తినడం వలనే పిల్లలకు లేనిపోని సమస్యలు వస్తాయని అన్నారు. పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ అయితే డెంగ్యూతో పాటు కొన్ని వ్యాధుల బారినపడి కుటుంబ సభ్యులకు లేనిపోని సమస్యలు వస్తాయని డాక్టర కిశోర్ అంటున్నారు.

Can Dengue Spread From Person To Person

* పచ్చ కర్పూరం, కలబంద, ఎండు వేపాకు

డెంగ్యూతో పాటు అంటు వ్యాధులను నివారించడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో నిప్పుల మీద ఎండు వేపాక వేసి పొగ పీల్చుకోవడం వలన ఇంట్లోని అందరూ ఆరోగ్యంగా ఉంటారని, పచ్చ కర్పూరం, కలబంద నిప్పుల మీద వేడి చేసి వాటి వాసన పీల్చడం వలన డెంగ్యూతో పాటు అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్ కిశోకర్ అన్నారు.

* అపార్ట్ మెంట్ ఉంటే సరిపోదు

అపార్ట్ మెంట్ల పరిసర ప్రాంతాల్లో చెట్లు. పార్కులు, పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి అపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉండే చెట్ల తొర్రల్లో కూడా వర్షం నీరు నిల్వ ఉంటుందని, అలా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్లకు ఏమీ కాదని, అదే అపార్ట్ మెంట్ లోని మొదటి, రెండవ, మూడవ అంతస్తులో ఉండే వాళ్లకు దోమలు కుట్టడం వలన డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ కిశోర్ అన్నారు. అపార్ట్ మెంట్ లోని చెట్ల మొదళ్లు, పూలకుండీల్లో, మోక్కలు ఉండే ప్రాంతాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవడం వలన డెంగ్యూ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు.

Can Dengue Spread From Person To Person

* స్వచ్చమైన గాలి, వెలుతురు ఉండాలి

ఇంట్లోకి స్వచ్చమైన గాలి, వెలుతురు రావాలని, దోమల భయంతో ఎప్పుడూ తలుపులు, కిటికీలు మూసి ఉంచరాదని, అలాంటి సమయంలో కిటికీలకు, తలుపులకు మస్కిటో మెస్ వేసి తలుపులు, కిటికీలు తీసి ఉంచాలని డాక్టర్ కిశోర్ అన్నారు. మస్కిటో కాయిల్ ఎక్కువగా ఉపయోగించి వాటి వాసన పీలిస్తే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆస్మా వ్యాధి బారినపడే అవకాశం ఉంటుందని డాక్టర్ కిశోర్ హెచ్చరించారు. ఉదయం, మద్యాహ్నం చేసిన అన్నం, కూరలు రాత్రి వేడి చేసి తినడం వలన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడమే కాకుండా అనారోగ్యం బారిన పడుతారని డాక్టర్ కిశోర్ హెచ్చరించారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion