Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బడ్జెట్‌లో అతిపెద్ద శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై వారికి అన్నీ ఫ్రీ
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఆమె దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దేశంలో రోజు రోజూకూ పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అలాగే క్యాన్సర్ రోగులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం దేశంలో క్యాన్సర్ చికిత్సకు చాలా మేలు చేస్తుందని చెప్పారు. అలాగే దేశంలోని క్యాన్సర్ రోగులకు ఇది మద్దతు ఇస్తున్నట్లు అవుతుందని వెల్లడించారు.
ప్రస్తుతం మన దేశంలో రొమ్ము క్యాన్సర్ రోగులు బాగా పెరిగిపోయారని, ఏడాదికి 5.6% రొమ్ము క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారని పేర్కొన్నారు. దీనిపై నిర్వహించిన పలు సర్వేల్లో కూడా ఇదే విషయం వెలువడైందని, దానిని దృష్టిలో ఉంచుకొని భారత దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య క్యాన్సర్ బారిన పడిన కుటుంబాలపై ఉండే ఆర్ధిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. భారతదేశంలో ప్రజారోగ్య కార్యక్రమాలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. క్యాన్సర్‌కు సరైన చికిత్స లేక చాలా మంది చనిపోవడాన్ని ప్రత్యక్షంగా తీసుకున్న ప్రజలు ఈ నిర్ణయంతో చాలా మంచి పని చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన ట్యాక్స్ విధానం తీసుకురావడంపై కూడా తమ వంతుగా స్పందిస్తున్నారు. తమకు కొంత ఉపశమనం కలిగించారని పోస్టులు పెడుతున్నారు. తాము సంపాదించేదంతా ట్యాక్సులకే కాకుండా కొంతం తమకు కూడా మిగిల్చారని అందుకు సంతోషమని పేర్కొన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications