Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
ఇవి తింటే పుష్కలంగా వైటమిన్ కె.. ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసా..?
శరీరానికి అన్ని పోషకాలు చాలా అవసరం. ఏ ఒక్క పోషకం శరీరానికి సరిపడా అందకపోయినా అనారోగ్యానికి గురౌతాము. పోషకాలు సరిగ్గా తీసుకుంటే తరువాత వచ్చే గాయాల నుంచి అనారోగ్యాల నుంచి సురక్షితంగా బయటపడగలిగే అవకాశం ఉంటుంది. అలాంటి పోషకాల్లో వైటమిన్ కెకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా గాయం ఐతే రక్తం బయటకు వెక్కువగా పోకుండా బయటి రక్తాన్నిగడ్డకటించేదే ఈ వైటమిన్ కె దీంతొ పాటు యముకలను బలంగా ఉంచడం, గుండె పనితీరును మెరుగుపరచడం కూడా ఈ వైటమిన్ కె చేస్తుంది.

యముకలకు చాలా బలం
వైటమిన్ కె వల్ల శరీరంలో ఓస్టియోకాల్సిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇది యముకలను మరింత బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. యుముకలు విరిగినా, వయసు మీదపడిన సమయంలో ఈ వైటమిన్ కె శరీరాన్ని సురక్షితంగా కాపాడుతుంది.
బ్లడ్ క్లాట్
గాయమైతే రక్తం బయటకు వెళ్లగానే ఇక ఎక్కవ ప్రవహించకుండా దానికదే బయట కొంచం గడ్డకట్టిపోతుంది. ఈ గడ్డకట్టే లక్షణమే శరీరంలో ప్రొత్రొంబిన్ అనే ప్రొటీన్ ద్వారా సంభవిస్తుంది. విటమిన్ కె లేకపోతే ఈ ప్రొత్రొంబిన్ ప్రొటీన్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రొత్రొంబిన్ ప్రొటీన్‌ను శరీరంలో ఉండే చేసుకోవడం చాలా అవసరం. దానికి వైటమిన్ కె శరీరంలో తీసుకోవడం ఒక్కడే మార్గం.
గుండెకు వైటమిన్ కె
గుండె ఆరోగ్యంగా పనిచేయంలో కూడా వైటమిన్ కె కీలక పాత్ర పోషిస్తుంది. వైటమిక్ కె ద్వారా కాల్షియం హోమియోస్టాటిస్ గుండెను మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు యాంటీ కాల్సిఫిక్ ప్రొటీన్ "మ్యాట్రిక్స్ గ్లా"ను కూడా ఈ వైటమిన్ కె యాక్టివేట్ చేస్తుంది.
వైటమిన్ కె లోపం లక్షణాలు
శరీరంలో వైటమిన్ కె లోపం ఉందని పలు లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. వైటమిన్ కె లోపం ఉంటే ఎక్కువగా రక్తస్రావం, వెన్నునొప్పి, జుట్టు రాలడం, బరువు తగ్గడం, గాయాలు నయం కాకపోవడం, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయ్. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైటమిన్ కె ఉన్న ఆహారాం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
వైటమిన్ కె ఆహారాలు
ఆకుకూరల్లో వైటమిన్ కెతో పాటు వైటమిన్ ఎ, వైటమిన్ సిలు కూడా ఉంటాయ్. పాలకూర, గోంగూర, బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరలను భోజనంలో రోజూ కొంత తీసుకుంటే అవసరమైనం వైటమిన్ కె శరీరానికి అందుతుంది.
క్యాబేజ్‌లో కూడా వైటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. క్యాబేజ్‌ను సలాడ్‌లో ఉపయోగిస్తారు. కొందలు వాటితో పకోడీలు వేస్తారు. ఇందులో వైటమిన్ బి6 కూడా ఉంటుంది. క్యాబేజ్‌లో కొలస్ట్రాల్ తగ్గించే లక్షణం కూడా ఉంటుంది.
పచ్చి బటానీల్లో కూడా వైటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఈ పచ్చిబఠానీలను పిల్లలు అలాగే తినడానికి ఇష్టపడతారు. వీటిని ఉడికించి స్నాక్స్‌లా తయారు చేసకోవచ్చు. కూరల్లో పచ్చి బఠానీలు ఉపయోగిస్తే శరీరానికి అవసరమైనంత వైటమిన్ కె లభించినట్లే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications