Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Ramzan 2023: రంజాన్ ఉపవాసం వేళ ఈ పదార్థాలు తినొద్దు, లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు
ఇస్లాం మత ఆచారాల ప్రకారం రంజాన్ నెలను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఈ నెల రోజులు ముస్లింలు చాలా మంది కఠిన ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ సంవత్సం రంజాన్ ఎర్రటి ఎండాకాలంలో వచ్చింది.
మామూలుగా ఎండాకాలంలో చాలా మంది డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. నీటిని తక్కువగా తీసుకునే చాలా మంది అలసట, నీరసం, తలనొప్పి లాంటి లక్షణాలతో డీహైడ్రేషన్ కు గురై ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఎండాకాలంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తారు వైద్యులు.

రంజాన్ మాసంలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కఠిన ఉపవాసం పాటిస్తారు. ఈ సమయంలో వాళ్లు కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. ఎండాకాలంలో నీరు తాగకపోతే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది.
రంజాన్ ఉపవాసాన్ని పాటించే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటి వల్ల మరింత వేగంగా డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. రంజాన్ వేళ డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ, కాఫీ:
ప్రపంచవ్యాప్తంగా నీటి తర్వాత చాలా ఎక్కువగా తాగే పానీయం, ఎక్కువ మంది తాగే పానీయం టీ, కాఫీలు. టీ, కాఫీల్లో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. అందుకే టీ, కాఫీలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. టీ, కాఫీలను పూర్తిగా తాగడం మానేయలేకపోతే కనీసం వాటిని తాగడం తగ్గించడం మంచిది.
సాల్టీ ఫుడ్ ఐటెమ్స్:
సమోసాలు, పకోడీలు, ఇతర సాల్టీ ఫుడ్ ఐటెమ్స్ కు వేసవిలో దూరంగా ఉండటం మంచిది. సెహ్రీలో వీటిని భాగం చేసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.
సాల్టీ ఫుడ్స్ వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తింటే త్వరగా దాహం వేస్తుంది. వాటికి బదులు పుచ్చకాయ, దోసకాయ లాంటి సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలను తీసుకోవడం మంచిది.
అధిక చక్కెర ఉండే ఆహారం:
శుద్ధి చేసిన చక్కెర అధికంగా ఉండే స్వీట్లను, ఇతర ఆహారాలను తినడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. షుగర్ ఫుడ్ ఎనర్జీ లెవల్స్ లో తక్షణ స్పైక్ ను ఇస్తుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా డిప్ అవుతుంది. దీని వల్ల ఆకలి కూడా తగ్గుతుంది.
అధిక చక్కెర ఉండే ఆహారానికి బదులు వోట్స్, మిల్లెట్లు, గుడ్లు వంటి తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు ఎంచుకోవడం మంచిది. స్వీట్లను ఇష్టపడే వారు, ఖర్జురాలు ఇతర పండ్లను తినడం మంచిది. పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శుద్ధి చేసిన చక్కెర లాగా వీటి వల్ల ఆరోగ్యానికి జరిగే హాని ఉండదు.
ఉపవాసం తర్వాత ఎక్కువ నీరు తాగొద్దు:
కఠిన ఉపవాసం తర్వాత ఒక్కసారిగా అతిగా నీరు తాగొద్దు. దీని వల్ల కడుపులో జీర్ణ రసాలు పలుచన అవుతాయి. అధిక నీరు తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు. ఉపవాసం పూర్తవగానే మొదట కొన్ని నీళ్లు తాగాలి. తర్వాత మరికొన్ని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications