Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Food For Brain : మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఇవి తినాల్సిందే..!
శరీరం దృఢంగా మారడానికి ప్రటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. మరి మెదడు చురుగ్గా ఉండాలంటే ఏ ఆహారం తినాలనే సందేహం మనకు ఎప్పుడో ఒకప్పుడు వచ్చే వుంటుంది. మెదడు పనితీరు మరింత బాగా ఉండాలంటే వాటికి అవసరమైన పోషకాలు అందాలి. అప్పుడు మాత్రమే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడుకు ఆహారం ఎంత అవసరమో నీళ్లు, ఆక్సీజన్ కూడా అంతే అవసరం. అయితే కేవలం ఆక్సీజన్, నీళ్లు మాత్రమే సరిపోవు. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు, పళ్లు తినడం వల్ల మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుందో తెలుసుకుందాం.
ఆకుకూరలు, అవొకాడో
బ్రెయిన్ పనితీరు బాగుండాలంటే మెదడుకు యాంటీ ఆక్సిడెంట్లు బాగా అందాలి. బ్యాక్టీరియా ద్వారా దెబ్బతిన్న బ్రెయిన్ సెల్స్‌ను బాగుచేసే శక్తి వైటమిన్ ఈ కు వుంటుంది. వైటమిన్ ఈ మెండుగా వుండే ఆకుకూరలు, అవొకాడో, పల్లీలను ఆహారంలో తీసుకుంటూ వుండాలి.

అన్ని రకాల పోషకాలు
కేవలం రెండు మూడు రకాల పళ్లు, కూరగాయలు కాకుండా అన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి. అన్ని వైటమిన్లను, ప్రొటీన్లను శరీరానికి అందేలా చూడాలి.
మెగ్నీషియం
బ్రెయిన్ పనీతీరులో మెగ్నీషియం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో బయోకెమికల్ రియాక్షన్లు ఈ మెగ్నీషియంతోనే జరుగుతాయ్. కాబట్టి మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, పల్లీలు, కాజూ, బాదాం లాంటి నట్స్ తీసుకుంటూ ఉండాలి.
నీళ్లు ఎక్కువగా తాగాలి
మెదడుకు నీళ్లు చాలా అవసరం. మూడ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే మెదడుకు సరిపడా నీరు అందుతూనే ఉండాలి. ప్రతీ రోజు సాధ్యమైనంత ఎక్కువ నీళ్లను తాగాలి. ఉదయం లేవగానే పరిగడపున 1 లీటరు వరకు నీళ్లు తాగి, రోజులో మిగతా సమయం మొత్తం కలిపి మరో రెండు లీటర్లు తాగితే మెదడుకు, శరీరానికి కావలసిన నీరు అందుతుంది.
వైటమిన్ బి12
మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరు, వాటి సంఖ్య బాగుంటేనే మెదడు ఆరోగ్యంగా వుంటుంది. ఈ న్యూరోట్రాన్స్‌మీటర్ల ఉత్పత్తిని వైటమిన్ బి12 పెంచుతుంది. మాంసం, చేప, గుడ్లు, పాలలో ఈ న్యూరో ట్రాన్స్‌మీటర్లు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు
మెదడులో కణాలు చురుగ్గా పనిచేయడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా వున్న చియాగింజలను, వాల్‌నట్స్‌ను సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
చక్కెర తక్కువ
చక్కెరను ఎంత తగ్గిస్తే మీ మెదడుకు అంత మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చెక్కర శాతం ఎక్కువగా ఉండే స్వీట్లు, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలని కోరుతున్నారు. తియ్యదనం కోసం వీటికి బదులుగా పళ్లను తినాలని సూచిస్తున్నారు.
టమాట
బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయో లేదో తెలియదు కానీ టమాట తింటే బ్రెయిన్ చురుగ్గా అవుతోందంటున్నారు. టమాటలో ఉండే లైసోపిన్ డిమిన్షియా రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. ఆల్జిమర్ వ్యాధి రాకుండా కూడా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడి విత్తనాలు
గుమ్మడి విత్తనాల్లో ఉండే జింక్ జ్ఞాపకశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, వైటమిన్ బి కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
మెదడు చురుగ్గా ఉండాలంటే కేవలం అందుకు తగిన ఆహారం మాత్రమే కాదు కొన్ని అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. పొగతాగే అలవాటు ఉంటే మానివేయాలి. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. క్రమం తప్పకుండా అన్ని పోషకాలు ఆహారంలో వుండేలా జాగ్రత్తపడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
