Latest Updates
-
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు!
ఆపరేషన్ అక్కర్లేదు..3 రోజుల్లోనే పైల్స్ సమస్యకు చెక్ పెట్టే వంటింటి చిట్కా
ప్రస్తుతం మారిన ప్రజల ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలతో చాలా మందిని వేధిస్తున్న భయంకరమైన సమస్య పైల్స్ (మొలలు). మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలు ఉబ్బి, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట, ఒక్కోసారి రక్తస్రావం కలిగించే ఈ వ్యాధి గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు. నొప్పిని భరిస్తూ, సమస్యను ముదరబెట్టుకుంటారు.
చాలామంది పైల్స్ అనగానే ఆపరేషన్ ఒక్కటే మార్గమని భయపడతారు. అయితే మన ప్రాచీన ఆయుర్వేదం ఎలాంటి కోత లేకుండానే ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించే సులువైన, శక్తివంతమైన మార్గాలను సూచిస్తోంది. మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే కేవలం మూడు రోజుల్లో అద్భుతమైన ఫలితాలను చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆవు పాలు, నిమ్మరసం
ముందుగా ఒక కప్పు ఆవు పాలను బాగా మరిగించాలి. తర్వాత అది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చాలి. ఇప్పుడు అందులో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పాలను తాగేయాలి. ఇలా వరుసగా మూడు రోజుల పాటు ఉదయాన్నే పరగడుపున చేయాలి. ఇది శతాబ్దాలుగా పైల్స్ నివారణకు ఉపయోగిస్తున్న ఒక అద్భుతమైన ప్రయోగం. ముఖ్యంగా రక్తస్రావంతో కూడిన మొలల సమస్యతో బాధపడేవారికి ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ చిట్కా పాటించిన మొదటి రోజు నుంచే రక్తస్రావం ఆగిపోవడం మీరు గమనిస్తారు. కేవలం మూడు రోజుల్లోనే నొప్పి, వాపు తగ్గి సమస్య నియంత్రణలోకి వస్తుంది.
అరటిపండు, కర్పూరం
ఒక బాగా పండిన అరటిపండును మధ్యలోకి చీల్చి, అందులో బఠానీ గింజంత కర్పూరాన్ని ఉంచండి. ఆ ముక్కను నేరుగా మింగేయాలి. మార్కెట్లో దొరికే రసాయన కర్పూరాన్ని వాడకూడదు. పూజకు ఉపయోగించే స్వచ్ఛమైన దేశీ కర్పూరాన్ని మాత్రమే వాడాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనిని అస్సలు నమలకూడదు. ఇలా కూడా వరుసగా మూడు రోజులు ఉదయాన్నే పరగడుపున చేస్తే, మొండి మొలల సమస్య కూడా అదుపులోకి వస్తుంది.
జీవనశైలిలో చిన్న మార్పులు
పైల్స్ కు ప్రధాన కారణం మలబద్ధకం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా త్రిఫల చూర్ణం కలిపి తాగితే ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది.
కరక్కాయ పొడిని రోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడి, మలం మృదువుగా మారుతుంది.
పవనముక్తాసనం వంటి యోగాసనాలు జీర్ణవ్యవస్థను బలపరిచి, పైల్స్ సమస్య పునరావృతం కాకుండా చూస్తాయి. ఈ సహజమైన, సులువైన పద్ధతులను పాటించడం ద్వారా ఆపరేషన్ అక్కర్లేకుండానే మొలల సమస్య నుంచి శాశ్వత ఉపశమనం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications