Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
నెయ్యిలో దోరగా వేయించిన వెల్లుల్లి.. మీ ఆరోగ్యానికి సంజీవని.!
భారతీయ వంటకాల్లో నెయ్యి, వెల్లుల్లికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వెజ్, నాన్‌వెజ్‌లో వెల్లుల్లి ఎంత అవసరమో.. తీపి పదార్థాల్లో నెయ్యిదీ అదే స్థానం. కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా.? వీటి కలయిక ఆయుర్వేదంలో ఒక శక్తివంతమైన ఔషధం. ఈ మిశ్రమాన్ని డైలీ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.

వెల్లుల్లిలో ఇదే ప్రత్యేకత
నెయ్యిలో వేయించిన వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వెల్లుల్లిలో ఉండే 'అల్లిసిన్’ అనే సమ్మేళనంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని నెయ్యిలో వేయించినప్పుడు ఆ పోషకాలను శరీరం త్వరగా స్వీకరిస్తుంది. వీటి కాంబినేషన్ సహజ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తద్వారా సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
నెయ్యితో ఈ సమస్యకు చెక్
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీవక్రియ మెరుగుపరడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా లేక గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి నెయ్యి అద్భుతమైన ఇంటి చిట్కాగా పనిచేస్తుంది.
నెయ్యి, వెల్లుల్లిని కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. అదేవిధంగా గుండె పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించి, ఊపిరితిత్తుల నివారణలో ఈ కాంబినేషన్ చేసే మేలు అద్భుతం.
వీటిని ఎలా తీసుకోవాలి..
ముందుగా రెండు వెల్లుల్లి గడ్డలను తీసుకుని ముందురోజు రాత్రంతా మజ్జిగలో నానబెట్టాలి. ఉదయానే వాటి పొట్టు తీసి రెబ్బలుగా వేరుచేయాలి. తర్వాత బాణలిలో సరిపడా నెయ్యి వేసి వెల్లుల్లి రెబ్బలను దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత తడిలేని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఓ వారం రోజులకి సరిపడా ఈ మిశ్రమాన్ని తయారుచేసుకుంటే ఉత్తమం. ఎక్కువ మొత్తంలో తయారుచేసుకుంటే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
నెయ్యి, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి రోజూ రెండు రెబ్బలు తీసుకుంటే చాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తుంది. అధికంగా తీసుకుంటే ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఏ రోగానికైనా మందులు వాడుతున్న వారు.. ఈ చిట్కాను పాటించే ముందు సంబంధిత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
