Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.!
మన పూర్వీకులు ఎంత బలంగా, దృఢంగా ఉండేవారో తెలియనిది కాదు. రాళ్లు తిన్నా ఇట్టే అరిగించుకునే సామర్థ్యం ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులతో పొట్ట చుట్టూ కొవ్వు చేరిపోతోంది. కడుపు నిండా భోజనం చేస్తే అరిగించుకునే శక్తి లేకుండా పోతుంది. అందుకే ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి తాతల కాలం నాటి చిట్కాను డాక్టర్లు సూచిస్తున్నారు.

ఈ కాలంలో రెండేళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ జీర్ణక్రియ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం అగ్నిదోషం. ఈ దోషం వల్ల వచ్చేదే ఆమా. ఆమా అంటే టాక్సిన్. ఈ టాక్సిన్ వ్యర్థాలను మన శరీరం బయటకు పంపించకపోవడం, అన్‌డైజెస్టెడ్ ఫుడ్ సరైన పద్ధతిలో బయటకు వెళ్లకపోతే అదే ఆమా దోషంగా డాక్టర్లు పేర్కొంటున్నారు. డయాబెటిస్, ఇన్సులిన్, హైపర్ కొలెస్ట్రాల్ వంటి వాటిని ఆమా దోషంగా పరిగణిస్తారు.
అయితే ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ మన పూర్వీకులు తీసుకున్న ఫుడ్‌ని మరిచిపోతున్నాం. కొత్త పోకడలకి పోయి జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ ఇలా కొత్త ఆహారాలకు బానిస అవుతున్నారు. క్రమంగా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు పిల్లలకు ఉగ్గు తినిపించేటప్పుడు పెట్టే ఆహారంలో సైతం మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పూర్వకాలంలో పిల్లలకు ఉగ్గు తయారుచేసేటప్పుడు మట్టి కుండలో అన్నం మెత్తగా ఉడికించి, అందులో శొంఠి పొడి, ఆవు నెయ్యి కలిపి పిల్లలకు తినిపించేవారు. తద్వారా వారికి సులభంగా జీర్ణమయ్యేది. శొంఠి పొడిలోని జింజెరాల్స్, షాగోల్స్ వంటి క్రియాశీలక ఔషధ గుణాల మేళవింపుతో చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారు. అందులోని ఫైబర్, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే ఈ మిశ్రమం పిల్లలకే కాదు పెద్దవాళ్లకి సైతం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. రోజూ రెండు పూటలు అన్నం తినేటప్పుడు మొదటి మూడు ముద్దలు శొంఠి పొడి, ఆవు నెయ్యితో కలిపి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు పోయి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందని సూచిస్తున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మొత్తంగా జీవక్రియను మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా ఈ మిశ్రమం రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవడం ద్వారా ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంపైన వాపులను తగ్గించడంలో దోహదపడతాయి. ఈ పొడిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, కండరాల వాపులను తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఆవు నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో మంటను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును పెంపొందిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి, నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి దోహదపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications