Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
ప్రకృతి ప్రసాదించిన టూత్ బ్రష్..వేప పుల్లతో పళ్లు తోముకుంటే కలిగే ప్రయోజనాలివే
పొద్దున్నే నిద్రలేవగానే దాదాపు అందరూ చేసే మొదటిపని బ్రష్ చేయడం. రంగురంగుల ట్యూబుల్లో వచ్చే టూత్ పేస్ట్ లు, ఆకర్షణీయమైన బ్రష్‌లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అయితే ఈ రసాయనాలతో నిండిన పేస్టులకు శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం ఉందని మీకు తెలుసా? అదే మన పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన వరం.. వేప పుల్ల. నేటికీ పల్లెటూళ్లలో, చిన్న పట్టణాలలో చాలా మంది ఆరోగ్యకరమైన, ముత్యాల్లాంటి దంతాల కోసం వేపపుల్లపైనే ఆధారపడతారు. దీని వెనుక బలమైన శాస్త్రీయ, ఆయుర్వేద కారణాలు ఉన్నాయి.
శతాబ్దాల నాటి ఆరోగ్య సూత్రం
ఒకప్పుడు టూత్ బ్రష్ లు, పేస్టులు లేని కాలంలో మన తాతముత్తాతలు తమ దంత సంరక్షణకు ఏం చేసేవారని ఎప్పుడైనా ఆలోచించారా? వారు ప్రకృతిలో లభించే వేప, తుమ్మ , కానుగ వంటి చెట్ల కొమ్మలనే తమ బ్రష్ లుగా వాడేవాళ్లు. ఇది కేవలం దంతాలను శుభ్రం చేసుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. అది దంతాలు, చిగుళ్ళు,మొత్తం నోటి ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంపూర్ణ ఆయుర్వేద దినచర్య. ఇది చవకైనది మాత్రమే కాదు, ఎన్నో ఔషధ గుణాలతో నిండినది. గ్రామాల్లో ఇప్పటికీ ఉదయాన్నే వేప పుల్లను నములుతూ కనిపించే పెద్దల దంతాలు ఉక్కులా బలంగా, ముత్యాల్లా తెల్లగా మెరవడానికి కారణం ఇదే.

ప్రయోజనాలు అపారం
-వేప, తుమ్మ పుల్లలు రుచికి చేదుగా ఉంటాయి. వాటిలో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, ఆస్ట్రింజెంట్ (రక్తస్రావాన్ని అరికట్టే) గుణాలు పుష్కలంగా ఉంటాయి. మనం పుల్లను నములుతున్నప్పుడు దాని నుండి వచ్చే రసం నోటిలో బ్యాక్టీరియాను చంపేసి, దంతాల మీద పేరుకుపోయిన పాచిని, మురికిని సమర్థవంతంగా తొలగిస్తుంది.
-వేప పుల్లను బాగా నమిలినప్పుడు, దాని చివర ఉండే పీచు పదార్థాలు (ఫైబర్స్) బ్రష్ కుచ్చుల్లా మారతాయి. ఈ కుచ్చులు దంతాల మధ్య సందుల్లోకి సులభంగా వెళ్లి, అక్కడ ఇరుక్కున్న ఆహార పదార్థాలను, పాచిని తొలగిస్తాయి. ఇది ఒక సహజమైన ఫ్లాస్ లాగా పనిచేస్తుంది.
-పుల్ల కొనతో చిగుళ్లను నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. వేప, తుమ్మ పుల్లల నుండి వచ్చే చేదు రసం చిగుళ్ల వాపు, రక్తస్రావం, నోటి దుర్వాసన వంటి సమస్యలను దూరం చేస్తుంది.
-మార్కెట్లో లభించే అనేక టూత్ పేస్ట్ లలో ఫ్లోరైడ్, ట్రిక్లోసాన్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ వేప పుల్ల 100శాతం సహజమైనది, ఎటువంటి దుష్ప్రభావాలు లేని సురక్షితమైన ప్రత్యామ్నాయం.
-ఇది కేవలం దంతాలను శుభ్రపరచడమే కాకుండా, నోటిలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి రోజంతా శ్వాసను తాజాగా ఉంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications