Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కాఫీ, టీలు ఎక్కువ తాగుతున్నారా? అయితే ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పొద్దున్నే నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీ గొంతులో పడందే చాలామందికి రోజు మొదలవ్వదు. అది వారికి కేవలం ఒక పానీయం మాత్రమే కాదు రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి అవసరమైన ఇంధనం. అయితే ఎక్కువ కాఫీ, టీలు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదేమో అని భయపడేవారికి గుడ్ న్యూస్.
మితంగా కెఫిన్ ఉన్న కాఫీ లేదా టీ తాగడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే డిమెన్షియా (మతిమరుపు) వ్యాధి ముప్పు తగ్గుతుందని, మెదడు పనితీరు మెరుగవుతుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఎంఐటీ, మాస్ జనరల్ బ్రిఘమ్ పరిశోధకులు సంయుక్తంగా చేసిన ప్రతిష్టాత్మక అధ్యయనం ప్రఖ్యాత JAMA మెడికల్ జర్నల్ లో ప్రచురితమైంది.

అధ్యయనం ఏం చెబుతోంది?
పరిశోధకులు సుమారు 1,31,821 మంది ఆరోగ్య నివేదికలను దాదాపు 36 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విశ్లేషించారు. ఏజ్, ఎక్సర్ సైజ్, స్మోకింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ డేటాను పరిశీలించారు. ఈ అధ్యయనం ప్రకారం...రోజుకు 2-3 కప్పుల కాఫీ లేదా 1-2 కప్పుల టీ తాగేవారిలో మతిమరుపు (డిమెన్షియా) వచ్చే ప్రమాదం ఏకంగా 18 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
వీరిలో జ్ఞాపకశక్తి మందగించడం చాలా తక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..కెఫిన్ ఉన్న కాఫీ, టీలు మాత్రమే మెదడుకు రక్షణ కల్పిస్తున్నాయి. కెఫిన్ లేని కాఫీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమైంది.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డేనియల్ వాంగ్ మాట్లాడుతూ..డిమెన్షియాను అరికట్టే మార్గాలను అన్వేషిస్తున్నప్పుడు.. రోజూ మనం తాగే కాఫీ లాంటి ఒక సాధారణ పానీయం ఇంత అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తుందని మేము కనుగొన్నాము.. 40 ఏళ్ల నాణ్యమైన డేటా ఈ విషయాన్ని నిరూపించింది అని వివరించారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జన్యుపరంగా మతిమరుపు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి కూడా కాఫీ, టీలు సమానమైన ప్రయోజనాలను ఇస్తున్నాయని స్టడీ మెయిన్ ఆథర్..యు జాంగ్ తెలిపారు.
భారతీయులకు ఈ పరిశోధన ఎందుకు ముఖ్యం?
మన దేశంలో ఉదయం, సాయంత్రం చాయ్ లేదా ఫిల్టర్ కాఫీ తాగడం అనేది ఒక దైనందిన ఆచారం. అయితే 2050 నాటికి భారతదేశంలో డిమెన్షియా కేసులు నాలుగు రెట్లు పెరుగుతాయని అంచనాలు హెచ్చరిస్తున్నాయి.
మారుతున్న జీవనశైలి, కాలుష్యం, అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పట్టణవాసుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, మనం రోజూ ఇష్టంగా తాగే కాఫీ, టీలు మెదడుకు రక్షణ కవచంగా పనిచేస్తాయని తెలియడం నిజంగా పెద్ద ఊరట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
