Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Padma Awards 2026: వైద్యో నారాయణో హరి..మెడిసిన్ లో 2026 పద్మ అవార్డులు దక్కించుకున్న తెలుగు తేజాలు వీళ్లే
భారత ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 2026 పద్మ పురస్కారాల లిస్ట్ లో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన జాబితాలో దేశవ్యాప్తంగా మొత్తం 131 మంది అవార్డులు ప్రకటించగా..ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
కేవలం హాస్పిటల్ నాలుగు గోడలకే పరిమితం కాకుండా, సమాజ ఆరోగ్యం కోసం, ముఖ్యంగా పసిబిడ్డలు, గ్రామీణ పేద ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం నిరంతరం శ్రమించే డాక్టర్లను పద్మ గౌరవం వరించింది. ఈ ఏడాది విజేతల్లో ఎక్కువ మంది నవజాత శిశువుల సంరక్షణ, గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేసినవారే కావడం విశేషం.

పద్మభూషణ్ గ్రహీతలు
వైద్య రంగంలో విశేష సేవలందించినందుకు ఇద్దరు సీనియర్ డాక్టర్లకు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ లభించింది.
డాక్టర్ కల్లిపట్టి రామసామి పళనిస్వామి: నవజాత శిశువుల సంరక్షణలో దశాబ్దాల అనుభవం కలిగి, ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను నిలబెట్టిన తమిళనాడుకి చెందిన డాక్టర్ కల్లిపట్టి రామసామి పళనిస్వామికి భారతదేశపు 3వ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషన్ ప్రకటించారు.
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు: ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో జన్మించిన డాక్టర్ నోరి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. ప్రపంచ ప్రఖాత అంకాలజిస్ట్ గా అంతర్జాతీయంగా పేరుగాంచిన వీరు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలతో పాటు బలహీన శిశువుల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. దీంతో భారతప్రభుత్వం దేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారానికి ఈయనకు ప్రకటించింది. 2015లో డాక్టర్ నోరికి పద్మశ్రీ లభించింది. 2025 మార్చి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్నారు.
పద్మశ్రీ..సేవామూర్తులకు గుర్తింపు
ఈ ఏడాది పద్మశ్రీ జాబితాలో మాతా-శిశు సంరక్షణ, గ్రామీణ వైద్యానికి ప్రాధాన్యతనిచ్చారు.
మాతా శిశు సంరక్షణలో విప్లవం
మహారాష్ట్రకు చెందిన డాక్టర్ అర్మిదా ఫెర్నాండెజ్ ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్(తల్లిపాల నిధి) స్థాపించి చరిత్ర సృష్టించారు. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకు తల్లిపాలు అందించి వారి ప్రాణాలను కాపాడటంలో ఆమె కృషి వెలకట్టలేనిది.
తెలంగాణ నుంచి వైద్య రంగంలో పద్మశ్రీ
వైద్య రంగంలో సామాన్యులకు కూడా అత్యాథునిక ట్రీట్మెంట్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గూడూరు వెంకట్ రావు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులైన తెలంగాణకు చెందిన డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డిలకు దేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ దక్కింది. రోగుల భద్రత, నవజాత శిశువుల సంరక్షణ,ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంలో వీరి పాత్ర కీలకం.

గ్రామీణ వైద్యానికి ఊపిరి
లడఖ్ డాక్టర్ పద్మ గుర్మెట్, తమిళనాడులో డాక్టర్ హెచ్.వి. హండే, డాక్టర్ పున్నియమూర్తి నటేశన్ పేదలకు వైద్యాన్ని చేరువ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కేవల్ క్రిషన్ థక్రాల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్యామ్ సుందర్ గ్రామీణ రోగులకు ఆపద్బాంధవులుగా నిలిచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు
అంకితభావం
ఛత్తీస్ గఢ్ కు చెందిన వైద్య దంపతులు శ్రీ రామచంద్ర, శ్రీమతి సునీతా గాడ్బోలే గిరిజన ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సరోజ్ మండల్, కర్ణాటకకు చెందిన డాక్టర్ సురేష్ హనగవాడి సామాజిక బాధ్యతతో వైద్య సేవలందిస్తున్నారు. అమెరికాలో ఉంటూనే ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో మార్పుల కోసం డాక్టర్ ప్రతీక్ శర్మ కృషి చేశారు. వీరిని పద్మశ్రీ వరించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
