Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
చూడడానికి చిన్న పండే.. కానీ ఉపయోగాలు మాత్రం బోలెడు! ఆ వ్యక్తులు మాత్రం దీనిని తప్పకుండా తీసుకోవాలి
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన విషయమే. అందుకే వైద్యులు ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినాలని సూచిస్తుంటారు. బాదం, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉన్న పుష్కలమైన పోషకాలు శరీరాన్ని పుష్టిగా మార్చడంతో పాటు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరును కూడా పెంచడంలో సహాయపడతాయి.
అయితే చాలా మంది ఎండు ద్రాక్షను సహజంగానే తింటారు. కానీ నిపుణుల ప్రకారం, ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేదంలో కూడా ఎండుద్రాక్షను తీసుకోవడం ద్వారా అనేక లాభాలు ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఈ స్టోరీలో ఎండు ద్రాక్షలు తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎండు ద్రాక్షల వలన కలిగే ప్రయోజనాలు
మూత్రపిండాల ఆరోగ్యం:
ఎండుద్రాక్షలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను తొలగించి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మూత్ర పిండాల సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు ఎండు ద్రాక్షను నానబెట్టి తినడం వలన మంచి ప్రయోజనాలను పొందొచ్చు.
రక్తపోటు నియంత్రణ
ఎండుద్రాక్షలో అధికంగా పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది పొటాషియం సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. దీనితో పాటు డైటరీ ఫైబర్, పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎముకలకు బలం:
నానబెట్టిన ఎండుద్రాక్ష ఎముకలను బలపర్చడంలో సహాయపడుతుంది. మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు ఎండుద్రాక్షను వాడడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఎముకలు బలంగా మారడంతో పాటు నడుము నొప్పి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
కాలేయ ఆరోగ్యం
ఎండుద్రాక్షను నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల కడుపులోని విషపదార్థాలు శుద్ధి అవుతాయి. ఇది కాలేయాన్ని శక్తివంతం చేసి, రక్త శుద్ధికి సహాయపడుతుంది. కాలేయ పనితీరు పెరిగి, జీర్ణం సరిగ్గా జరిగేందుకు సహాయపడుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
రోగనిరోధక శక్తి
ఎండుద్రాక్ష జీవక్రియను మెరుగుపరిచే మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పండులోని డైటరీ ఫైబర్ మలబద్దకం తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన బారిన పడకుండా నివారిస్తుంది. అలాగే మన ఆరోగ్యం సరిగ్గా ఉండేందుకు సహాయపడుతుంది.
రక్తహీనత నివారణ
ఎండుద్రాక్షలో అధికంగా ఐరన్, విటమిన్ B కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం ఏర్పడడంలో సహాయపడతాయి. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు ఎండుద్రాక్షను తీసుకోవడం మంచి పరిష్కారం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications