Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా.. పెళ్లి కానీ ప్రసాదులు ఇది మీ కోసమే!
పెద్దల మాటలలో ఒక పాత నానుడి ఉంది "ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరిగితేనే బాగుంటుంది" అని. ఈ నానుడి మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాము. కానీ, కాలాలు మారుతున్నాయి. ఇప్పుడున్న యువత ముందు చదువు, కెరీర్, ఆత్మవిశ్వాసం.. తరువాతే ఏదైనా అని అంటున్నారు. అప్పట్లో 20వ దశకంలోనే వివాహం చేసుకునే వారు ఎక్కువగా ఉండేవారు. కానీ ప్రస్తుతం 30 సంవత్సరాల వయస్సు దాటాకే పెళ్లికి సిద్ధమయ్యే వారు ఎక్కువవుతున్నారు. ఇది కేవలం సమాజ మార్పే కాదు.. ఆరోగ్య పరంగా, మానసిక పరంగా కూడా చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? మనిషికి ఇది ఏ విధంగా సహాయపడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. మెచ్యూరిటీతో కూడిన నిర్ణయాలు:
వయస్సు పెరిగినకొద్దీ మనం భావోద్వేగాల కన్నా ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటాం. ఇది వివాహ జీవితంలో ఎంతో కీలకం. భాగస్వామితో సామరస్యంగా ఉండడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఇది పెద్ద ముఖ్యమైన విషయం.

2. ఆర్థిక స్వావలంబన:
తనకంటూ ఓ మంచి కెరీర్, సంపాదన ఉన్నవారు పెళ్లి తర్వాత ఆర్థికంగా మరింత నిష్ఠగా ఉంటారు. ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది కుటుంబంలో స్థిరతనిస్తుంది. ఆర్థికంగా బలపడడానికి పనికొస్తుంది.
3. భాగస్వామిని అర్థం చేసుకునే సామర్థ్యం:
తక్కువ వయస్సులో పెళ్లి చేసుకునే వారు ఎక్కువగా స్వయం సామర్థ్యం కలిగి ఉంటారు. కానీ వయస్సుతో పాటు వచ్చే జీవన అనుభవం వల్ల మనం అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఇది గట్టి బంధానికి పునాది వేస్తుంది. భాగస్వామిని అర్ధం చేసుకోవడం వల్ల కలహాలు లేకుండా జీవించవచ్చు.
4. స్వీయ అవగాహన:
తన వ్యక్తిత్వం, లక్ష్యాలు, అసలైన ఇష్టాలు ఏమిటో స్పష్టంగా తెలిసిన తర్వాత చేసుకున్న పెళ్లి మరింత సంతోషకరంగా ఉంటుంది. మనకి ఏవిధమైన భాగస్వామి అవసరమో కూడా సరిగ్గా అర్థమవుతుంది.
5. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది:
పెళ్లి విషయంలో తొందరపడకుండా, అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మానసికంగా కూడా సంతృప్తిగా, ఆత్మవిశ్వాసంగా ఉంటారు.
6. శారీరక ఆరోగ్య ప్రయోజనాలు:
కొన్ని పరిశోధనల ప్రకారం, ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు హెల్తీ లైఫ్‌స్టైల్ పాటించే అవకాశాలు ఎక్కువ. వ్యాయామం, మంచి ఆహారం, స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ వంటి విషయాల్లో వారు ముందు ఉంటారు.
అదనంగా తెలుసుకోవాల్సిన విషయాలు:
సామాజిక ఒత్తిడిని ఎదుర్కోవడంలో బలంగా మారతారు
వివాహం ఆలస్యం అవుతుందంటే చుట్టుపక్కల నుండి కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ ఒత్తిడిని కూడా ధైర్యంగా ఎదుర్కొనగలగడం వల్ల వ్యక్తిత్వం మరింత బలపడుతుంది.
పెళ్లి ముందే జీవితం గురించి స్పష్టత కలుగుతుంది
బంధం అంటే ఏమిటో, జీవితంలో భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉండాలో తెలిసినపుడే చేసుకున్న పెళ్లి, త్వరగా విడిపోవడం అనే సమస్యల్ని నివారించగలదు.
చివరగా..
పెళ్లి అనేది ఒక జీవితాంత బంధం. ఇది త్వరగా కాకుండా సరైన సమయంలో, సరైన వ్యక్తితో జరిగితేనే సంతోషకరంగా ఉంటుంది. ఆలస్యంగా వివాహం చేసుకోవడం అంటే కచ్చితంగా వెనకబడటం కాదు. అది ముందు చూపు అని అర్ధం. ఎప్పుడైతే మీరు మీ జీవితంలో మీరే సంతోషంగా, సంతోషాన్ని పంచగల స్థితిలో ఉంటారో, అప్పుడే ఆ బంధం గట్టిగా నిలవగలదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
