Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ రోగాలు రావడం పక్కా!
చలికాలంలో చలి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. సాధారణం కంటే ఎక్కువ వేడి కలిగిన నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. వెచ్చగా ఫీల్ అవ్వడానికి వేడి నీటిలోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే అత్యధికంగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని పేర్కొంటున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం పొడిగా మారుతుంది..
సాధారణంగా చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం పొడిగా మారడంతో పాటు, పగిలిపోతుంటుంది. అయితే చలికాలంలో అధిక వేడి కలిగిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం డీహైడ్రేటెడ్‌గా మారుతుంది. దీని వల్ల చర్మం పొడిగా మారడంతో పాటు పగిలిపోతుంటుంది. అందుకే చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడానికి బదులు, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మేలు.

ఇన్ఫెక్షన్స్, దురద
అధిక వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో సేబమ్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా శరీరంలో సహజమైన నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మంపై దురద, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పైగా చర్మం పొడిగా మారడంతో రంగు కూడా మారిపోయే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలు తీవ్రత మరింత అధికం
వేడి నీటితో స్నానం చేయడం వల్ల.. ఇప్పటికే సోరియాసిస్, ఎగ్జేమా, రోసాసియాలాంటి చర్మ సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులకు మరింత సమస్యగా మారుతుంది. చర్మం సహజసిద్ధమైన ఆయిల్స్ కోల్పోయి మరింత ప్రమాదకరంగా మారే ఛాన్సుంటుంది.
జుట్టు కూడా రాలుతుంది..
వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టుకు కూడా సమస్యలు వస్తాయి. జుట్టు బలహీనంగా మారడంతో పాటు వేగంగా రాలిపోతుంటుంది. జట్టులోని సహజసిద్ధమైన మెరుపు, తేమ ఉండకపోవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల జట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బతిని జుట్టును బలహీనపరుస్తాయి. క్రమంగా జుట్టును పట్టుకున్నా రాలిపోయే ప్రమాదం ఉంది.
గోరువెచ్చని నీరు అయితే ఒకే..
ఎక్కువగా వేడిగా ఉన్న నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. గోరు వెచ్చని నీటితో స్నానం చేసినప్పటికీ పది నిమిషాలకు మించి చేయకూడదు. అలాగే స్నానం చేసిన వెంటనే శరీరానికి హైడ్రేటింగ్ క్రీమ్స్ వినియోగించాలి. దీని వల్ల చర్మంలోని తేమ అక్కడే ఉంటుంది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. వీలైతే చలికాలంలో కూడా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications