Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Jamun: నేరేడు పండ్లు తిన్న వెంటనే ఇవి అస్సలు తీసుకోకూడదు..విషంతో సమానమే!
సమ్మర్ లో మామిడికాయలతో పాటుగా లభించే మరో ఆరోగయకరమైన పండు నేరుడుకాయ. దీనిని ఇండియన్ బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు. నేరేడు పండు.. తీపి,పులుపు, కొద్దిగా వగరు యరుచుల సమ్మేళనంతో ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా అనేక ఔషధ గుణాలకు కూడా ప్రిసిద్ధి చెందింది. నేరేడు పండులో పొటాషియం, విటమిన్ సీ, మెగ్నీషియం, కాల్సియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ పండు తినడం ద్వారా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
అయితే నేరేడు పండు తిన్న వెంటనే కొన్ని ఆహారపదార్థాల జోలికి వెళ్లకూడదు. నేరేడు పండు ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొన్ని ఆహార పదార్థాలను దానితో కలిపి లేదా తిన్న వెంటనే తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు లేదా ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి నేరేడు పండు తిన్న వెంటనే తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ చూడండి.

పాలు,పాల ఉత్పత్తులు
నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు,టీ వంటి అస్సలు తీసుకోకూడదు. నేరేడు పండులో ఉండే ఆమ్ల గుణాలు పాలతో కలిసినప్పుడు విరుద్ధంగా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది..దీనివల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్దకం,కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నేరేడు పండు తిన్న తర్వాత కనీసం అరగంట నుండి ఒక గంట సమయం ఆగి పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
చాలామందికి తెలియని రహస్యం
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు కూడా తాగకూడదు. నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడి విరేచనాలు లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నేరేడు పండు తిన్న తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం మంచిది.
ఖాళీ కడుపుతో తినకూడదు
నేరేడు పండులో టానిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం వంటివి ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తింటే కడుపులో గ్యాస్,అసిడిటీ, మంట లేదా వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. ఉదయం అల్పాహారం తర్వాత లేదా భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత నేరేడు పండ్లను తినడం మంచిది.

స్పైసీ ఫుడ్స్
నేరేడు పండ్లు తిన్న తర్వాత స్పైసీ ఫుడ్స్ అంటే కారం ఎక్కువగా ఉండే ఆహారాలు లేదా చిప్స్ వంటి జంక్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. పొరపాటున తీసుకున్నారంటే అది విషంతో సమనమే.
ఊరగాయలు
నేరేడు పండ్లు తిన్న తర్వాత ఊరగాయలను తినడం మంచిది కాదు. ఊరగాయలలో సాధారణంగా ఎక్కువ నూనె, మసాలాలు, ఆమ్లాలు వెనిగర్ వంటివి ఉంటాయి. ఇవి నేరేడు పండుతో కలిసినప్పుడు కడుపులో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను పెంచుతాయి. కాబట్టి నేరేడు పండ్లు తిన్న తర్వాత ఊరగాయలు తినాలనుకుంటే కనీసం ఒక గంట పాటు వేచి ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications