Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మహిళ గుండె అంటే దానికి ఇష్టం?

నేటిరోజుల్లో వారు వివిధ రకాల ఉద్యోగాలు, వ్యాపకాలు ఆచరిస్తున్నారని ప్రత్యేకించి గుండెపోట్లు, మెనోపాజ్ దశలోకి చేరుతున్న మహిళలను లక్ష్యం చేస్తున్నాయని వీరు వెల్లడించారు. కుటుంబ చరిత్ర, ఒత్తిడి, కాలుష్యం, రక్తపోటు, డయాబెటీస్, కొల్లెస్టరాల్ వంటివి ప్రధానంగా చిన్నవయసు వారిలో గుండెపోట్లు కలిగిస్తున్నాయి. మహిళలు తప్పక తమ జీవన విధానం మార్చుకోవాలని వ్యాయామాలు, నియమిత ఆహారం, ధ్యానం వంటివి తప్పక చేయాలని, మెనోపాజ్ దశకు చేరుతున్నవారు, తప్పక సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
పోషకాహార లోపం ప్రత్యేకించి యుక్తవయసులో వుంటే, దాని ప్రభావం వారికి తర్వాతి వయసులో కరోనరీ హార్ట్ డిసీజ్ గా పరిణమిస్తుందని ఒక తాజా అధ్యయనం తెలుపుతోంది. యువతకు చిన్న వయసులో వున్నపుడు కలిగిన తీవ్రపోషకాహార లోపం భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ స్టడీని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ యుట్రెట్ మరియు యూనివర్శిటీ ఆఫ్ ఆమస్టర్ డామ్ పరిశోధకులు రెండవ ప్రపంచయుద్ధం చివరిలో వచ్చిన తీవ్ర కరువు సమయంలో సుమారుగా 7845 మహిళలపై నిర్వహించారు. రీసెర్చర్లు తమ స్టడీని 1993 - 1997 ల మధ్య ప్రధానంగా మహిళల బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గా మొదలుపెట్టి దానిని 2007 వారకు కొనసాగించారు. కరువు సమయంలో దానికి గురై వున్న మహిళలలో గుండె సంబంధిత కరోనరీ వ్యాధులు తీవ్రంగా వచ్చినట్లు తెలిపారు. కరువు సమయంలో ఈ మహిళల వయసు 10 నుండి 17 సంవత్సరాలున్నాయని, వీరికి తర్వాతి వయసులో 38 శాతం అధిక గుండె సంబంధిత రిస్కు కలిగిందని తెలిపారు.
పరిశోధకులు తమ పరిశోధనలో కరువు సమయంలో మహిళల వయసు, వారి విద్య, జీవన విధానం, స్మాకింగ్ వంటి అలవాట్లు అన్నిటికి ప్రాధాన్యతనిచ్చారు. కరువు సమయంలో దాని బారిన పడిన మహిళలకు, కరువంటే తెలియని మహిళల కంటే అధిక సమస్యలున్నాయని నిర్ధారించారు. ఈ స్టడీని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications