Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గ్రీన్ టీ-బ్లాక్ టీతో బరువు నియత్రణనే కాదు..గుండె కూడా పదిలమే..

‘టీ'లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. రెండు యాపిల్స్ లో, ఐదు రకాల కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రెండు కప్పుల టీలో లభిస్తాయి. ఈ తాజా పరిశోధనాంశాలను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. టీ లుండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బ్లాక్ టీలో ఉండే ప్లేవనాయిడ్ ఎంత ఉంటుందో అంతే మోతాదులో గ్రీన్ టీలో లభిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. టీ, టీలో ఉండే ప్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని, ఎండోథీలియల్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసే వాటిలో ఇవి కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి. ‘టీ' తీసుకున్న వారిలో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం చాలా తక్కువగా కనిపించింది. టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఎథెరోస్కెలెరోసిన్ పెరుగుదలను నిరోధిస్తోంది. అని పరిశోధనలో పాల్గొన్న డా. కేథరిన్ హుడ్ అభిప్రాయపడ్డారు.
టీ తాగడం వల్ల మరికొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
1. రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.
2. బ్లాక్ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.
3. రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.
4. టీలో ఉండే ఫ్లోరైడ్ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.
5. గ్రీన్, బ్లాక్ టీలలో ఉండే ఎల్-థయానైన్ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
6. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
7. అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు.
8. టీ డీహైడ్రేషన్ సమస్యనూ దూరం చేస్తుంది. నీరు తాగేందుకు దోహదం చేయును.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
