Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
గుండె ఆరోగ్యానికి గుడ్డు... ఓట్స్..ఆలివ్...!

చేపలు ఆరోగ్యానికి మంచివని అధ్యయనాలు చెబుతున్నా అవి కూడా మాంసాహారమేగా అనేది చాలామందిని వేధించే సందేహం. కానీ ఈ భావన కచ్చితంగా అర్థరహితమే కొవ్వుతో కూడిన చేపలని తినేవారిలో గుండెజబ్బులన కారణంగా సంభవించే చేపలు తినడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ కలుగుతుంది. ప్రత్యామ్నాయ పోషకాలు అధికంగా ఉండే వాల్ నట్లు, అవిసగింజలు, రామ్ మా, జొన్నలు, సజ్జలు, గోధులము తినడం వల్ల ప్రయోజనాలని పొందవచ్చు.
గుడ్డు: ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల గుండెజబ్బు వస్తుందని వేడిచేస్తుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ అభిప్రాయంలో వాస్తవం లేదు. వారంలో వారం రోజులు గుడ్డు తిన్నా కూడా దాని కారణంగా ఎటువంటి గుండెజబ్బులూ రావడానికి ఆస్కారం లేదని వైద్య నిపునులు అంటున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు తలెత్తుతాయి కానీ, కాలేయం కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేయాలంటే ఆహారంలో హానికారక శాచురేటెడ్, ట్రాన్స్ ప్యాట్లు ఉన్నప్పుడే అది సాద్యం అవుతుంది. నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్ శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి.
ఓట్స్: ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కి కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇదే రకం పీచు
పదార్థం బార్లీలో కూడా ఉంటుంది.
ఆలివ్: కేవలం ఆలివ్ నూనె మాత్రమే గుండె జబ్బులని నివారిస్తుంది అనడం వాస్తవం కాదు. మోనోశాచునేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం వల్ల గుండెజబ్బులు రాకుండా ఆలివ్ నూనె కాపాడుతుందన్నది నిజమే అయినా దీనిలో మరో కీలకమైన పాలీఅన్ సాచురేటెడ్ కొవ్వులు కూడా చాలా తక్కువనే విషయాన్నీ గుర్తించాలి. యాంటీఆక్సిడెంట్లకి ఆలివ్ పెట్టింది పేరు. ముఖ్యంగా పాలిఫినాల్స్ కి. అందుకే గుండె జబ్బులు తగ్గాలంటే ఆలివ్ నే వాడాలని మొదట్లో అనుకొన్నా అవే సుగుణాలు తక్కిన నూనెల్లోనూ ఉంటాయని తాజా అధ్యనాలు తేల్చిచెబుతున్నాయి. సోయాబీన్స్, రైస్ బ్రాన్, వేరుశెనగ, ఆవ నూనెల వాడకం వల్ల కూడా సమస్యలు నియంత్రణలో ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications