For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకో చేప.....షుగర్ వ్యాధి మాయం!

By B N Sharma
|

Fish A day keeps diabetes away
స్పెయిన్ దేశస్ధులు డయాబెటీస్ రాకుండా రోజుకో చేపను తింటారట. ఇలా తినే వీరిలో డయాబెటీస్ మచ్చుకైనా కనపడటం లేదంటారు ఈ అంశంపై రీసెర్చి చేసిన వాలెన్షియా మెనర్సిడస్ సోటోస్ ప్రీటో యూనివర్శిటీ పరిశోధకులు. పరిశోధకులు 55 నుండి 80 సంవత్సరాల వయసున్న గుండెజబ్బు రోగులను షుమారు వేయి మంది పురుషులు, మహిళలను పరిశోధించారు. వీరిలో వున్న డయాబెటీస్ సైతం వీరు తినే చేప ఆహారానికి తగ్గుముఖం పట్టిందని తేలినట్లు చెపుతున్నారు.

రెడ్ మాంసాన్ని అధికంగా తినటం, బ్లడ్ ప్రెజర్ పెంచి గుండె సంబంధిత రిస్కు కలిగిస్తుందని, దానితోపాటే డయాబెటీస్, కేన్సర్ వంటివి కూడా వచ్చి జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించినట్లు న్యూట్రిషియన్ హస్పిటలేరియా అనే జర్నల్ ప్రచురించింది. వీరు గుండె సంబంధంగా చేసిన రోజుకో చేప ఆహారం పరిశోధనలో, దాని అదనపు ప్రయోజనంగా డయాబెటీస్ సైతం తగ్గుముఖం పట్టిందని వెల్లడైంది.

చేప ఆహారంలో వుండే ఒమేగా 3 ఇన్సులిన్ సెన్సిటివిటీ ని పెంచుతోందని దీని కారణంగా డయాబెటీస్ కూడా తగ్గుముఖం పడుతోందని తేలింది.

English summary

Fish A day keeps diabetes away | ఒకే చేపతో....రెండు లాభాలా?

The increase of Omega-3 in the cells of the skeletal muscles improves insulin sensitivity, a factor associated with the lowered risk of diabetes. Eating red meat in excess is tied to higher cardio risk, higher blood pressure, diabetes and a moderate decrease in life expectancy mainly due to cancer or heart disease, the journal Nutrition Hospital aria reports.
Story first published:Tuesday, January 10, 2012, 10:29 [IST]
Desktop Bottom Promotion