Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గుండెపోటు రాకుండా నివారించేందుకు సులువైన మార్గాలు..

మీకు కీవీ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే తరచూ తినండి. కీవీ ఫ్రూట్స్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను సమర్థంగా 15 శాతం తగ్గించగలదు. ఒక మందులా రక్తాన్ని పలచబార్చేందుకు ఆస్పిరిన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో... మందు కాకపోయినా కీవీ పండు కూడా అలాంటి ఫలితాలను ఇస్తుందని ఓస్లో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఎముకలు ఆరోగ్యంగా ఉన్నవారిలో గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది గుండెపోటుకు గురవుతుంటారు. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోడానికి క్యాల్షియమ్ పుష్కలంగా తీసుకోవడం అవసరమని జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ పేర్కొంది. క్యాల్షియమ్ కోసం రోజూ కనీసం 200 ఎం.ఎల్. పాలు తాగడం ఒక తేలికైన మార్గం.
కొవ్వులేని పాలతో తోడేసిన పెరుగు తినడం మంచిది. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే వెనిల్లా ఫ్లేవర్‌తో లభ్యమయ్యే యోగర్ట్ తింటే... అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారిస్తాయని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సెన్సైస్ పేర్కొంటోంది.
తాజా ఆకుకూరలు, కాయగూరలు, పళ్లు, పీచుపదార్థాలు తీసుకోవాలి. మాంసం తగ్గించి తీసుకోడం మంచిది. మాంసాహారం ఇష్టమున్నవారు చేపలు తీసుకోవడం మంచిది. రోజూ కనీసం 20 నిమిషాలు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ ఏదోకటి చేయాలి. నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్స్, పిజా ఫిజా, బేకరీ ఐటవమ్స్ తీసుకోడం అంతమంచిది కాదు. సిగరేట్, బీడి, పొగాకు, చుట్ట అలవాటుంటే మానేయాలి. రెగ్యులర్‌గా బిపి, సుగర్, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకునే సాధారణ స్థాయిలో ఉంచుకుంటే గుండెపోటు రాకుండా నివారించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications