Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
గుండెపోటు రాకుండా వుండాలంటే?

1. బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇందుకు క్రమం తప్పక ప్రతిరోజూ ఏరోబిక్స్ వ్యాయామాలు చేయాలి. నడక. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
2. రక్తపోటు రాకుండా ఆహారంలో ఉప్పు తొలగించాలి. పూర్తిగా తొలగించలేనివారు కొంత మేరకు తగ్గించాలి. దీనికి బదులుగా ఆహారంలో ఎక్కువ మొత్తం పొటాషియం గల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
3. పొగాకు ఉత్పత్తులు, పొగతాగడం, ఆల్కహాల్, లిక్కర్, మాదకద్రవ్యాలు వంటివి మోతాదు మించి సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండెపనితీరు మారుతుంది.
4. వయసు పైబడుతున్న కొద్ది రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడతాయి. కనుక రక్తనాళాలు విశాలం అవడానికి విటమిన్ -బికి చెందిన నియాసిస్ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన టాబ్లెట్లు వాడటానికి వైద్యుల సలహా తప్పనిసరిగా వుండాలి.
5. గోధుమ ఊక, వేరుశనగపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, కోడిగుడ్డు, చేపలలో బి - విటమిన్ ఎక్కువ. బి. విటమిన్ శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తినిస్తుంది.
6. బేటా కెరోటిన్ అధికంగా వుండే ఆహారాలు తినాలి. బేటా కెరోటిన్, కేరట్లు, కేబేజి, వింటర్ స్క్వాష్, చిలకడ దుంపలు, పచ్చని ఆకు కూరలు, బాదం పప్పులు మొదలైనవాటిలో అధికంగా వుంటుంది. ఈ ఆహారాలు తింటే గుండెకు తగిన బలం ఏర్పడి, గుండెపోట్లు రాకుండా వుంటాయి.
సరళమైన ఈ చిట్కాలు పాటిస్తే రక్తపోటు, దాని నుండి వచ్చే గుండెపోటు మీ వద్దకు చేరవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
