Latest Updates
-
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం..
కార్డియాక్ అరెస్ట్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ ఒకటేనా?

ఇక హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె బాగా బలహీనపడి శరీరానికి కావలసిన సరిపడినంత రక్తాన్ని సరఫరా చేయలేక పోవడం అని అన్నమాట. సాధారణంగా గుండె శరీరంలోని అన్ని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. మొదట శరీరంలోని వివిధ అవయవాల నుంచి వచ్చిన అపరిశుద్ధ రక్తం గుండెలోని కుడి గదుల్లోకి అంటే మొదట కుడి కర్ణికలోకి తిరిగి అది ముడుచుకుపోవడం వలన కుడి జఠరికలోనికి వెళుతుంది. తిరిగి ఈ కుడి జఠరిక కూడా సంకోచించడం అంటే ముడుచుకోవడం వలన ఈ అపిశుద్ధ లేదా చెడు రక్తం ఊపిరితిత్తులలోకి వెళుతుంది. అక్కడ ఊపిరి తిత్తులలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్ళి ఆక్సిజన్ ప్రవేశించి, అపరిశుద్ధ రక్తం పరిశుద్ధంగా మారుతుంది. ఈ పరిశుద్ధ రక్తం తిరిగి గుండెలోని ఎడమ కర్ణికలోనికి, తర్వాత ఎడమ జఠరికలోకి ప్రవేశించి అక్కడినుంచి శరీరంలోని వివిధ అవయావాలకు సరఫరా అవుతుంది. ఒకవేళ ఏదైనా పరిస్ధితులు లేదా కారణాల వలన రక్తం శరీరంలోని భాగాలకు సరఫరా కాకపోతే దానినే హార్ట్ ఫెయిల్యూర్ అని అంటారు.
ఈ వ్యాధి లక్షణాలెలావుంటాయి? గుండె ద్వారా శరీరంలోని అన్ని ఇతర భాగాలకు రక్తం సరఫరా సక్రమంగా జరిగితేనే మనిషి శరీరంలోని వివిధ అవయవాలు సజావుగా వాటి విధిని నిర్వహిస్తాయి. కానీ ఇక్కడ శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా కావటం లేదు కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్ కు లక్షణాలుగా వీటిని చెప్పుకోవచ్చు.
1. ఆక్సిజన్ తో కూడిన పరిశుద్ధమైన రక్తం సరఫరా కాకపోవడం వలన నీరసంగా వుండటం.
2. సరిగా సమయానికి ఆకలి కాకపోవటం, ఒకవేళ ఆహారం తీసుకొన్నా తీసుకొన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం.
3. మూత్ర విసర్జన సరిగ్గా ఉండకపోవటం.
4. ఒక్కోసారి రక్తం కాళ్ళ దగ్గర వరకు సరఫరా కాకుండా కాళ్ళు వాయడం, అంటే కాళ్ళు వాపు రావడం.
5. ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకు వెళ్ళే అవయవాలకు గుండె రక్తాన్ని సరఫరా చేయపోవడం వల్ల ఆ రక్తం ఊపిరితిత్తులలో నిలచిపోవడం జరుగుతుంది. దీనినే వైద్య పరిభాషలో కంజెషన్ ఆఫ్ ది లంగ్స్ అని కూడా అంటారు.
ఊపిరితిత్తులలో ఈ విధంగా రక్తం నిలిచిపోవడం వలన ఊపిరి తీసుకోవడం చాలా కష్ట మవుతుంది. అందువలన మొదట్లో బాగా శ్రపడితే ఆయాసం రావడం వంటివి జరుతుతుంది. ఈ వ్యాధి ఇలానే కొనసాగితే కొించెం కష్టపడినా ఆయసం రావడం, కొంచెం దూరం నడిచినా ఆయసం రావడం వంటివి జరుగుతాయి.
ఈ వ్యాధి ఇంకా ఎక్కువైతే ఏ పని చేయకపోయినా పడుకొన్నా ఆయసం రావడం, ఒక్కోసారి ఆయాసం రావడంతోపాటు దగ్గు అధికనంగా రావడం వంటివి జరుగుతాయి.
హార్ట్ ఫెయిల్యూర్ కు కారణాలేమిటి?
1. గుండెలో రక్తాన్ని సక్రమంగా సరఫరా చేసేందుకు ఉన్న కవాటాలు దెబ్బతినటం వలన
2. ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ రావడం వలన.
3. కొన్ని సార్లు గుండె చుట్టూ ఉండే పొర వాపు వలన ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అయితే ఇవే కాకుండా మరికొన్ని కారణాలు కూడా వీటికి కారణమయ్యే అవకాశం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications