Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తనివి తీరా ఏడ్వండి! గుండెను కాపాడుకోండి!

కన్నీళ్ళు కళ్ళను శుభ్రం చేస్తాయి.
ఏడ్చేస్తే, కళ్ళలో వున్న నీరు జల జలా కిందకు రాలి మీ చూపు సరిగా వుండేలా చేస్తాయి. అవును అవి తప్పక పని చేస్తాయి. కన్నీళ్ళు మీ కనుగుడ్లను, కను రెప్పలను బాగా లూబ్రికేట్ చేసి వాటిలోని పొరలు ఎండిపోకుండా చేస్తాయి.
కన్నీళ్ళు బాక్టీరియాను చంపుతాయి
కన్నీళ్ళు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ఏజంట్లుగా పనిచేస్తాయి. క్రిములతో పోరాడి మీ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. మన దైనందిన చర్యలలో కళ్ళు, వివిధ ప్రదేశాలనుండి క్రిములను సంగ్రహిస్తాయి. ఆ క్రిములు పోవాలంటే, కంటివెంట నీరు రావటం మంచిదే. కంటినుండి బయటకు వచ్చే నీటిలో లైసోజైమ్ అనే ద్రవం వుంటుంది. అది 90 నుండి 95 శాతం బాక్టీరియాను 5 నుండి 10 నిమిషాలలో చంపేస్తుంది.
కన్నీళ్ళు మీ మూడ్ మారుస్తాయి
ఒక్కసారి ఏడ్చేస్తే ఆ వ్యక్తిలో మాంగనీస్ స్ధాయి తగ్గుతుంది. దానితో అతనిలోని ఆందోళన, నరాల ఉద్రిక్తత, కోపం, అలసట, భావావేశం అన్నీ ఒక్కసారి తొలగి మరేవైనా భావాలు వుంటే అవి లోపన వుండిపోతాయి.
కన్నీళ్ళు ఒత్తిడి తగ్గిస్తాయి.
వ్యాయామం వలెనే, కన్నీళ్ళు ఒత్తిడి తగ్గిస్తాయి. ఒత్తిడి కారణంగా శరీరంలో ఏర్పడిన రసాయనాలు కన్నీళ్ళతో తొలగించబడతాయి. కన్నీళ్ళు ఆపుకుంటే అది ఒత్తిడి పెంచుతుంది. ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు, పెప్టిక్ అల్సర్లు వంటివి వస్తాయి.
కన్నీళ్ళు మీ భావాలను మారుస్తాయి
ఒక్కసారి ఏడ్చేస్తే మీలో అప్పటివరకు వున్న ఆందోళన, విసుగు, చికాకు వంటివి ఒక్కసారి మాయమై మీ నరాల వ్యవస్ధ, హృదయ వ్యవస్ధ ఎంతో తేలిక అవుతాయి. ప్రతిసారి మీ గుండెలో ఏదో ఒకమూల లేదా బ్రెయిన్ లో ఏదో ఒక భాగంలో మీకు ఒత్తిడి కలుగుతూనే వుంటుంది. మీ భావాలు గాలి వంటివి. వాటిని ఎంత అణచిపెడితే అవి అంత ఒత్తిడి కలిగిస్తాయి. ఏదో ఒక రోజు పేలిపోయేలా చేస్తాయి. అణచుకున్న భావాలు మీ పనిలో నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. ఏడ్వటం అనేది మీ మైండ్ ను శుభ్రం చేస్తుంది. మీకు విశ్రాంతి భావనలనిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications