Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గుండెపోటును కనిపెట్టగల రక్తపరీక్ష!

ఈ రోగ నిర్ధారణ ఎంత అభివృధ్ధి చెందినప్పటికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ నిర్ధారణలు ఎంత వేగంగా చేసినప్పటికి నేటి రోజుల్లో వచ్చే గుండెజబ్బులు ఏ సమయంలో ఎంత వేగంగా వచ్చేది చెప్పలేకుండా వున్నామని, రీసెర్చర్లు తెలిపారు. డాక్టర్లకు వేగంగా ఒక్కపెట్టున వచ్చే ఈ గుండెపోట్ల నిర్ధారణకై క్లినికల్ గా ఒక పరీక్ష అవసరం ఎంతో వుందని కూడా తెలిపారు. ఈ స్టడీలో కనిపెట్టిన రక్తపరీక్షలో అది రక్తనాళాల గోడలు బలహీనపడితే సంబంధిత కణాలను గుర్తుపట్టేస్తుందట.
వాటిని సిఇసిలు (సర్కులేటింగ్ ఎండోధిలియల్ సెల్స్) అని అంటారు. పరీక్ష గుర్తుపట్టి గుండె జబ్బులను ప్రారంభంలోనే సూచిస్తుంది. గుండెకురక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో అడ్డంకులు గుండెపోటు వచ్చే ముందుగానే మొదలవుతాయని కార్డియాలజిస్టులు తెలుపుతారు. గుండె జబ్బుల ప్రధమ దశలో, రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. అవి రక్త సరఫరా మందగిస్తాయి. వాటిలోని కణాలు ఎర్రగా మారతాయి. ఇవి ఈ రకంగా మారి రక్తనాళాల గోడలకు లోపల వుండే ఎండోధిలియల్ సెల్స్ కు హాని కలిగిస్తాయి.
ఎండోధిలియల్ సెల్స్ టిష్యూ లోపలి లైనింగ్ ఏర్పరుస్తాయి. ఈ కణాలకు తీవ్ర మంట కలుగుతుంది. అవి విభజించబడి రక్తప్రవాహంలో కలుస్తాయి. ఈ స్టడీలో సుమారు 94 మంది రోగులు పాల్గొన్నారు. వీరిలో 50 మందికి గుండెపోటు రాగా, 44 మందికి అరికట్టబడింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications