Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
పని సామర్ధ్యం ఒకేసారి పూర్తిగా తగ్గిపోదు!

1. గుండె విఫలత లేదా హార్ట్ ఫెయిల్యూర్ సమస్య కలవారు ఇతర నొప్పులకు, కీళ్ళ వ్యాధులకు వాడే
మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటికోసం వాడే మందులు, స్టెరాయిడ్స్ ఈ వ్యాధిని ఇంకా
ఎక్కువ చేయవచ్చు. కనుక వీరు ఏ మందులు పడితే ఆ మందులు వాడక, ఏ వ్యాధి వచ్చినప్పటికి వైద్యుల సలహా మేరకు వారు ఆమోదించిన మందులు మాత్రమే కొనుగోలు చేసి వాడాలి.
2. ఈ వ్యాధి ఉన్నవారికి తగినంత విశ్రాంతి అవసరం. అధిక శారీరక శ్రమ వలన, మానసికంగా ఒత్తిడికి
గురికావడం వలన గుండెపై అదనపు భారం ఏర్పడి ఈ వ్యాధి లక్షణాలు ఇంకా అధికమయ్యే అవకాశాలున్నాయి. ఎక్కువ శ్రమ కలిగించే, ఆయాసం కలిగించే పనులు చేయకుండా నెమ్మదిగాపనులు చేసుకోవడం ఉత్తమం. తమకుగల ఈ వ్యాధిని వీరు కుటుంబంలోని ఇతర సభ్యులకు తెలియపరచి వారి సహాయ సహకారాలు పొందుతూ తమకు పనిభారం తగ్గించుకోవలసి వుంటుంది.
3. ఈ వ్యాధి ఉన్నవారు కాళ్ళు కదపకుండా ఎక్కువసేపు పడుకోవడం, కూర్చోవడం, ప్రయాణం
చేయడం చేయకూడదు. దీనివలన రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, దీనివలన కాళ్ళలో రక్తం గడ్డకట్టే
ప్రాదం ఉంది. ఒకవేళ దూర ప్రయాణాలు తప్పనిసరైతే మధ్య మధ్యలో కాళ్ళను కదిలించడం, వేళ్ళను
ఆడించటం వంటివి చేస్తుండాలి. కనుక దూర ప్రయాణాలు, లేదా శ్రమ కలిగించే ఇతర కార్యక్రమాలవంటివి చేపట్టరాదు. ఒకవేళ ప్రయాణాలు చేసినప్పటికి తగినంత సౌకర్యాలను కలిగి వుండి మాత్రమే చేయాలి.
4. ఈ వ్యాధి ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. చారు, సాంబార్లలో ఉప్పు వాడకాన్ని చాలా
భాగం తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్ధాలు అంటే ఊరగాయలు, మిక్చరు వంటివి
తినకూడదు.
5. అంతే కాకుండా భుక్తాయాసం వచ్చేంతవరకు నిండుగా భోంచేయకుండా కొంచెం తక్కువగా భోజనం
చేయాలి. భోజనం చేసిన వెంటనే ఆదరాబాదరాగా పనిచేయడం వంటివి చేయకుండా విశ్రాంతి
తీసుకోవడం, వంటివి చేయాలి.
ఇంకా ఈ వ్యాధి కోసం మందులు వాడేవారు రెగ్యులర్ గా వైద్యుడిని సంప్రదించడం, తరచుగా
బరువును చూసుకొని, పెరిగిన సూచనలుంటే వైద్యుని సలహాలు పాటించడం, ఈ వ్యాధి లక్షణాలను
తగ్గడానికి వాడే మందులను సరిగ్గా, సమయానుసారం వాడటం చేయాలి. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలను తప్పక పాటిస్తూ మందులు సక్రమంగా తీసుకొంటుంటే ఏ ఇబ్బందీ లేకుండా ఉండవచ్చు.
అయితే ఒక్కోక్కసారి కొన్ని పరిస్ధితుల్లో ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఈ ఆపరేషన్
వలన రోగికి స్వాంతన కలిగే అవకాశం ఉంది. వ్యాధి తీవ్రదశలో ఉంటే గుండె మార్పిడి కూడా
చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
అయితే ఈ గుండె పని సామర్ధ్యం అనేది ఒకేసారి పూర్తిగాతగ్గిపోదు. క్రమక్రమంగా గుండె పని సామర్ధ్యంలో మార్పు వస్తుంది. రక్తాన్ని శరీరానికి సరఫరా చేసేగుండె క్రమంగా తన పనిసామర్ధ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ఒకేసారి హార్ట్ ఫెయల్యూర్ కావడంజరగదు. చాలా మంది వ్యక్తులలో మొదట్లో హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించి ఇక్కడ మనం పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినా వారు దానిని అంత ప్రమాదంగా పరిగణించరు. అయితే అవి తీవ్ర రూపం దాల్చితే ప్రాణాలకే ముప్ప్పన్న సంగతి గ్రహించాల్సి ఉంటుంది.ఎన్ని జాగ్రత్తలు ఆచరించినప్పటికి, సమస్య వచ్చినపుడు తగిన విధంగా చికిత్స సైతం చేయించుకుంటూ తమ జీవితాన్ని వీరు గడపవలసి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











