Latest Updates
-
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త! - శుక్రవారం, 19 జూన్ 2026 -
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు
గుండెపోటు వచ్చినవారు తీసుకోవలసిన జాగ్రత్తలు!

1.గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యంత కీలకమైనది విశ్రాంతి.
2. గుండెపోటు వచ్చిన వ్యక్తి అతిగా ఆవేశపడటం, అధిక శ్రమను కలిగించే పనులు చేయడం చేయకూడదు.
3. శరీరంలో బి.పి., షుగర్, కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించుకోవాలి.
4. వైద్యులు సూచించిన మందులు నియమానుసారం వాడుతూ, వారు సూచించిన ఆహారపు అలవాట్లను పాటించాలి.
5. మద్యపానం, పొగాకు వాడకం వంటి వాటికి దూరంగా ఉండాలి.
6. ఎక్కువ బరువులు ఎత్తడం, దూరపు ప్రయాణాలు కార్లలో ప్రయాణించడం వంటివి చేయకూడదు.
7. వైద్యులు సూచించిన మేరకు ప్రతిరోజూ వ్యాయామం, నడక కొనసాగించాలి.
గుండెపోటు రాకుండా లేదా గుండెపోటు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. పొగాకు వాడకం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అది ఏ రూపంలో అయినా సరే పొగత్రాగటం, ముక్కుపొడి వాడకం, పొగాకు నమలటం వంటి వాటివల్ల పొగాకులో ఉండే నికోటిన్ అనే పదార్ధం మానవ శరీరంపై అత్యంత దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి పొగాకు వాడకాన్ని ఏ రూపంలోనైనా సరే నిషేధించాలి.
2. మధ్యం సేవించడం వలన రక్తపోటు పెరగడంతోపాటు, గుండె యొక్క కండరాలు, కాలేయ కణాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. కాబట్టి మద్యం సేవించడం మానివేయాలి.
3. అధికంగా కొవ్వును కలిగి ఉండే మాంసపదార్ధాలు ఐస్ క్రీమ్ లు, మీగడ, నూనె, నెయ్యి, వెన్న తదితర పదార్ధాలు అధికంగా తీసుకొంటే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగి కొలెస్ట్రాల్ కరోనరీ ధమనులలో పేరుకుపోయి సరిగ్గా రక్తప్రసరణ జరగక గుండెపోటుకు కారణమవుతుంది. కాబట్టి ఈ పదార్ధాల వాడుకను సాధ్యమైనంతగా తగ్గించడం మంచిది.
4. తాజా కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
5. బ్లడ్ ప్రెషర్ , షుగర్ ఉన్నవారు వైద్యుని సలహాలతో వాటిని కంట్రోల్ లో ఉంచుకోవాలి.
6 అధికంగా ఉప్పు, చక్కెర వాడకాలను తగ్గించాలి.
7. ప్రతిరోజూ నియమానుసారం వ్యాయామం, నడక కొనసాగించాలి.
8. బి.పి., షుగర్ ఉన్నవారు యాస్ప్రిన్, కొలెస్ట్రాల్ లను తగ్గించే మందులు వాడి ఈ గుండెపోటు రాకుండా చూసుకోవాలి.
గుండెపోటు వచ్చిన వ్యక్తి వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. వైద్యుడు గుండెపోటు వచ్చిందో లేదో తెలుసుకొనేందుకు ఇసిజి పరీక్ష చేసి గుండెపోటు వచ్చిందో లేదో తెలుసుకొంటారు. సాధారణంగా గుండెపోటు వస్తే బైపాస్ సర్జరీ, ఏంజియోగ్రామ్ లు చేయాల్సి వస్తుందని, వీటికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చాలా మంది భావించి గుండెపోటు లక్షణాలు తెలిసినా డాక్టరు దగ్గరకు వెళ్ళేందుకు సంకోచిస్తారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే.
గుండెపోటు వచ్చిన వ్యక్తులందరికు ఈ చికిత్సల అవసరం ఉండదు. నూటికి 20 శాతం మందికి మాత్రమే వీటి అవసరం ఉండవచ్చు. అది కూడా తప్పని సరి పరిస్ధితులలోనే అవసరపడుతుంది.
సాధారణంగా గుండెపోటు తిరిగి రాకుండా ఉండేందుకు వైద్యులు రోగికి అన్ని పరీక్షలు చేసి మూసుకుపోయిన రక్తనాళాలను తెరిపించడానికి లేదా బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి మందులతో చికిత్సను కొనసాగిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications