Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గుండె ఆరోగ్యానికి ఎన్ని గంటలు నిద్ర కావాలి?

నిద్రకు గుండె ఆరోగ్యానికి మధ్య గల సంబంధాన్ని రీసెర్చర్లు ఎప్పటికపుడు పరిశోధన చేసి కొత్త అంశాలను కనిపెడుతూనే వున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరిస్తే గుండెకు ఎంతో మంచిది. ఆరోగ్యెకర జీవన విధానం అంటే, ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేయటం, సరైన ఆహారం తినటం, పొగతాగటం, ఆల్కహాల్ తాగటం వంటివి మానివేయటం వంటివని గుర్తించాలి. అయితే, వీటికితోడు ప్రతిరోజూ తగినంత విశ్రాంతి కూడా అవసరమే.
అయితే, రోజూ ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనేది వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూంటుంది. ఒక శిశువు పగలు చాలా గంటలు నిద్రిస్తాడు. ముసలి వయసు వారు తక్కువగా నిద్రిస్తారు. సాధారణంగా ప్రతిరాత్రి కనీసం ఆరు నుండి ఏడు గంటల నిద్ర అవసరం అని వైద్యులు సిఫార్సు చేస్తారు. రాత్రివేళ ఈ మాత్రం నిద్రించిన వారికి మరుసటి రోజు ఎటువంటి చెడు ప్రభావం వుండదు. అయితే, ఈ 6 లేదా 7 గంటల నిద్ర క్రమం తప్పకుండా ప్రతిరోజూ వుండాలి. నిద్రలో మీ శరీర అవయవాలన్ని తగినంత విశ్రాంతి పొందుతాయి కనుక, గుండెకూడా పనిచేస్తున్న సమయంలో కొట్టుకునే రీతిలో కాక తగినంత విశ్రాంతి తీసుకుంటూ కొట్టుకుంటుంది. వేగం తగ్గిస్తుంది. కనుక గుండెకు కూడా విశ్రాంతి ఆరోగ్యాన్నిస్తుంది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిద్ర అంశంగా ఎన్నో పరిశోధనలు చేసింది. నిద్రకు ఊబకాయానికి, గుర్రు పెట్టటానికి, గల సంబంధాలను పరిశోధించింది. అధిక బరువుకలవారు గాఢమైన నిద్ర పొందటమనేది చాలా తక్కువ గంటలుగా వుంటుందని తెలిపింది. ఈ రకంగా నిద్రలేమితో బాధపడేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం వుంటుంది. సాధారణ శరీరాలు కలవారికి రోజుకు ఆరు నుండి ఏడు గంటల నిద్ర సరిపోతుందని తేల్చింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications