Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గుప్పెడంత గుండెకు ...కొండంత సంరక్షణ...?

- మనం తీసుకునే ఆహార పదార్ధాలలో ఉప్పు శాతం తగ్గించాలి. అంటే ఉప్పు అధికంగా ఉన్న ఊరగాయలు, పచ్చళ్ళు లాంటి వాటిని తినడం గణనీయంగా తగ్గించాలి. ఎందుకంటే అధిక రక్తపోటు ప్రభావం గుండెపై ఉంటుందన్న విషయం గతంలోనే వివరించాం.
- గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేసినా షుగర్, కిడ్నీ, సంబంధిత వ్యాధుల వలన అవి నయం కాకపోవచ్చు, కాబట్టి ఈ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు మూలకారణం. కాబట్టి మనం తీసుకొనే ఆహారంలో కొవ్వు పదార్ధాలు అతి తక్కువ శాతంలో ఉండేలా చూసుకోవాలి. అధిక కొవ్వు పదార్ధాలను కలిగి ఉండే మాంసాహార పదార్ధాలు, ఐస్ క్రీమ్ లు, నూనెలు, వంటి వాటిని మితంగా, అతి తక్కువగా వాడాలి.
- రోజూ పీచు పదార్ధాలు మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి ఎంతో మేలు చేస్తాయి.
- తాజా కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవడం గుండెకు ఆరోగ్యం.
ఇతర జాగ్రత్తలు ఎలా?
- పొగాకులోని నికోటిన్ అనే విషపదార్ధం శరీరంపై అనేక దుష్ప్రభావాలను చూపుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. కాబట్టి పొగాకు సంబంధిత పదార్ధాలు త్రాగడం, నమలడం మానివేయాలి.
- ఆరోగ్యవంతమైన శరీరానికి తద్వారా గుండెకు వ్యాయామం అనేది చాలా అవసరం. వాకింగ్, జాగింగ్, ఈత, స్కిప్పింగ్ వంటి వాటివలన శరీరంలోని కండరాల కదలిక గుండెకు మంచిని చేస్తాయి. అలాగే శారీరకంగా వ్యాయామం వలన శ్రమ చెందటం వలన రక్తపోటు తగ్గడం, షుగర్, కొలెస్ట్రాల్ తదితరమైనవి అదుపులో ఉండడం జరుగుతాయి.
- మద్యం అతిగా సేవించడం కూడా గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనిని తగ్గించడం, అవసరమైతే మానివేయడం అత్యవసరం.
- మనిషికి అసహనం, అశాంతి, ఆందోళన వలన కూడా కొన్ని గుండె సంబంధిత వ్యాధులు వస్తాయనేది పరిశోధనలలో తేలిన ఒక వాస్తవం. కాబట్టి మనిషి పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండటం, అనవసరంగా ఆందోళన, అసహనం చెందకుండా ఉండటం ఉత్తమం.
- ఆరోగ్యవంతమైన గుండెకు తగినంత విశ్రాంతి, నిద్ర కూడా అవసరమన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
- గుండెకు సంబంధించిన వ్యాధులకు చెందిన ఏ లక్షణాలు కల్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొంది మొదటిలోనే వ్యాధిని తగ్గించుకోవాలి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే అనవసరంగా బాధ మాత్రమేకాక సొమ్ము అధిక మొత్తంలో ఖర్చవుతుంది.
- గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్న వారు కూడా సంబంధిత డాక్టర్ల సలహా మేరకు వ్యాయామం మితంగా చేయవచ్చు. అది వారికి మంచిది కూడా.
- ఒక సారి గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స పొందిన వారు తిరిగి వ్యాధి రాదనే ధీమాతో ఆహార సంబంధిత విషయాలలో ఇష్టం వచ్చినట్లు తినడం, ఆరోగ్య సూత్రాలను పాటించకపోవడం చేస్తే, తిరిగి వ్యాధి సంక్రమించే అవకాశం వుంది.
రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం. అంతే కాకుండా మన దేశంలో ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ సంస్ధలు హెల్త్ పాలసీలు అందిస్తున్నాయి. వాటిని తీసుకుంటే అవసరమైన సందర్భాలలో ఆర్ధికంగా కొంతమేర సహకరిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications