Latest Updates
-
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.!
వాస్తవ గుండెపోటు నిర్ధారించే పరీక్షలు ఎలా?

గుండెపోటు రోగ నిర్ధారణలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి ఎలెక్ట్రో కార్డియో గ్రామ్ అంటే ఇసిజి తీయడం. ఇందులో గుండె కొట్టుకోవడంలో వచ్చే మార్పులు ప్రత్యేకంగా తెలుస్తాయి. గుండె కండరానికి జరిగే నష్టం తెలుస్తుంది. మరో ప్రధాన పరీక్ష అంటే, రక్త పరీక్ష దీనిలో ఎంజైములను కొలత వేసి నిర్ధారిస్తారు. రక్త ప్రసరణ నిలిచిపోయిన రక్తనాళంలో అడ్డంకి కారణంగా కొద్ది గంటలలోనే ఎంజైములు పెరుగుతాయి. ఈఎంజైములు కనుక పెరిగితే లేదా ఇసిజి లేదా ఎలెక్టరో కార్డియోగ్రామ్ కనుక అసాధారణమనిపిస్తే, మీకు గుండెపోటు వచ్చినట్లే. మిమ్మల్ని వెంటనే గుండె జబ్బుల హాస్పిటల్ లేదా లేబరీటరీకి మూసుకుపోయిన ఆ రక్త నాళాన్ని తిరిగి తెరవటానికిగాను తీసుకు వెళ్ళాల్సిందే.
గుండె పోటు నిర్ధారణలో ఇసిజి పాత్ర ప్రధానం అని తెలుసుకున్నాం. మరి ఇసిజిలో ఏం చూపిస్తుంది?
గుండెపోటు వచ్చినపుడు ఇసిజి లేదా ఎలక్ట్రో కార్టియోగ్రాం లో ఖచ్చితమైన మార్పులు కనపడతాయి. ఇసిజి కొన్ని భాగాలలో మార్పులు గణనీయంగా కనపడతాయి. దీనినే ఎస్ టి ఎలివేషన్ అంటారు. అది ఎలెక్ట్రో కార్టియో గ్రామ్ లో ప్రధానంగా మార్పు చెందుతుంది. వేరే ఏ ఇతర కారణం దీనిని మార్చలేదు. ఈరకమైన గుండెపోటును ఎస్ టి ఎలివేషన్ గుండెపోటు అంటారు. ఈ రకమైన గుండె పోటు గుండెను బాగా నష్టపరుస్తుంది. మరణం సంభవించే అవకాశాలు తగ్గేటందుకు అతి త్వరగా లేదా వెంటనే ఈ గుండెపోటు చికిత్స చేయాల్సివస్తుంది.
గుండె పోటు రక్తపరీక్షల వలన కూడా నిర్ధారించబడుతుందా? రక్తపరీక్షలలో గుండెపోటు ఏం చూపిస్తుంది. రెండు రకాల ఎంజైములను పరీక్షిస్తారు. రెండింటిని సాధారణంగా కొలుస్తారు. ఈ ఎంజైములు గుండె కండరంచే అది దెబ్బతినే సమయంలోనే రిలీజ్ చేయబడతాయి. కనుక అటువంటి సమయంలో తీసిన రక్త నమూనాలను పరిశీలిస్తారు.
ఈ ఎంజైములలో ఒక దానిని ట్రోపోనిన్ అయిన రెండవదానిని సికె అని పిలుస్తారను. ఈరెండు ఎంజైముల స్ధాయి పెరిగితే చాలు, గుండె కండరం అతి వేగంగా దెబ్బతింటోందని తెలుసుకోవాలి. వైద్యులకు గుండెలో సమస్య మొదలైందనే దానికి, వెంటనే చికిత్స చేయాలనేదానికి ఇది ఒక ప్రధాననిదర్శనంగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications